ఆ ఇద్దరికి రాజ్యసభ ఖాయమే!
టీఆర్ ఎస్ పార్టీ నుంచి రెండు గులాబీలు రాజ్యసభకు వెళ్లనున్నాయి. పార్టీలో చాలాకాలంగా సేవలందిస్తోన్న ఆ ఇద్దరినే రాజ్యసభ యోగం వరించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారెవరంటే..? మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావు, మరో సీనియర్ నేత దామోదర్ రావు. వీరికి రాజ్యసభ టికెట్ దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. కెప్టెన్ లక్ష్మీకాంతరావు పార్టీ ఆవిర్బావం నుంచి పనిచేస్తున్నారు. 2004లో టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. తెలంగాణ […]
Advertisement
టీఆర్ ఎస్ పార్టీ నుంచి రెండు గులాబీలు రాజ్యసభకు వెళ్లనున్నాయి. పార్టీలో చాలాకాలంగా సేవలందిస్తోన్న ఆ ఇద్దరినే రాజ్యసభ యోగం వరించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారెవరంటే..? మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావు, మరో సీనియర్ నేత దామోదర్ రావు. వీరికి రాజ్యసభ టికెట్ దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. కెప్టెన్ లక్ష్మీకాంతరావు పార్టీ ఆవిర్బావం నుంచి పనిచేస్తున్నారు. 2004లో టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం సీట్ల సంఖ్య 120. ఒక్క రాజ్యసభ సీటు కావాలంటే.. కనీసం 41 మంది ఎమ్మెల్యే బలం అవసరం. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ 63 స్థానాలు గెలుచుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పుడు అధికారపార్టీ బలం 83కు చేరింది. దీంతో వీరిద్దరిని రాజ్యసభకు పంపడం ఇక లాంఛనమేని తేలిపోయింది.
మరి నాయిని, సుధారాణికి అవకాశం లేనట్లేనా?
రాజ్యసభ ఆశావహుల జాబితాలో సీనియర్ నేత, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సుధారాణికి టికెట్ కేటాయించే అవకాశాలు చాలా తక్కువ. పైగా సుధారాణికి మద్దతుగా నిలిచే కేడర్ కూడా చాలా తక్కవే! నాయిని ఆరోగ్యకారణాల దృష్ట్యా రాజ్యసభకు వెళతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్, దామోదర్ పేర్లు తెరపైకి వచ్చాయి. కెప్టెన్, దామోదర్‌లు కేసీఆర్ కి అత్యంత ఆప్తులు. పైగా దామోదరావు ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రిక బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఇకపోతే నాయిని కేసీఆర్ కు కుడిభుజం అన్న సంగతీ తెలిసిందే! మొత్తానికి రెండు సీట్లు, ముగ్గురు ఆశావహులు ఉన్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరన్నది త్వరలోనే తేలిపోనుంది.
కెప్టెన్ అత్యంత కేసీఆర్ కు ఆప్తుడు!
కేసీఆర్- కెప్టెన్ లక్ష్మీకాంతారావు దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారాయన! కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులన్న పేరూ ఉంది. కేసీఆర్‌కు కెప్టెన్ ఎంత చెబితే అంత అంటారు పార్టీలోని సీనియర్ నాయకులు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వెంటే కలిసి నడుస్తున్నారు లక్ష్మీకాంతారావు. అంతేకాదు.. కొన్ని సందర్భాలలో కేసీఆర్‌కు ఆర్ధికసాయాన్ని కూడా అందించారని చెప్పుకుంటారు. లక్ష్మీకాంతరావుకు, కేసీఆర్‌కు మధ్య ఇంత దోస్తానీ ఉంది కాబట్టే ఆయన అడగగానే సతీశ్‌బాబుకు 2014 ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ఇచ్చారు కేసీఆర్.. ఇవ్వడమే కాదు గెలిపించారు కూడా! అంతటితో ఆగకుండా సతీశ్ బాబుకు పార్లమెంటరీ సెక్రటరీ పదవిని కూడా కట్టబెట్టి గౌరవించారు.
Advertisement