పూరీ చేతిలో ఆ ముగ్గురు హీరోలు... 

ప్రస్తుతం పూరి జగన్నాధ్ కెరీర్ డల్ ఫేజ్ లో ఉంది. కానీ ఫ్యూచర్ ప్రాజెక్టులు చూస్తుంటే మాత్రం ఊపందుకునేలా ఉంది. అయితే ఆ ప్రాజెక్టుల్లో ఎన్ని సాకారం అవుతాయనేదే పెద్ద ప్రశ్నగా నిలిచింది. ఈమధ్యే పూరీకి సంబంధించి రెండు వార్తలు చూసాం. పోకిరి పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మహేష్ తో మరో సినిమా చేస్తానంటూ జనగనమణ అనే టైటిల్ తో ఏకంగా పోస్టర్ కూడా విడుదల చేశాడు పూరి. ఆ వెంటనే…వెంకీ 75వ సినిమాకు పూరి జగన్నాధ్ […]

Advertisement
Update:2016-05-11 08:29 IST
ప్రస్తుతం పూరి జగన్నాధ్ కెరీర్ డల్ ఫేజ్ లో ఉంది. కానీ ఫ్యూచర్ ప్రాజెక్టులు చూస్తుంటే మాత్రం ఊపందుకునేలా ఉంది. అయితే ఆ ప్రాజెక్టుల్లో ఎన్ని సాకారం అవుతాయనేదే పెద్ద ప్రశ్నగా నిలిచింది. ఈమధ్యే పూరీకి సంబంధించి రెండు వార్తలు చూసాం. పోకిరి పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మహేష్ తో మరో సినిమా చేస్తానంటూ జనగనమణ అనే టైటిల్ తో ఏకంగా పోస్టర్ కూడా విడుదల చేశాడు పూరి. ఆ వెంటనే…వెంకీ 75వ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించే అవకాశముందంటూ మరో వార్త కూడా వచ్చింది. ఈ రెండు వార్తలకు అదనంగా ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్. త్వరలోనే ఎన్టీఆర్ తో కూడా పూరి జగన్నాధ్ ఓ సినిమా చేస్తాడట. టెంపర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమాకు నేతాజీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. ఇలాప్రస్తుతానికైతే పూరీ చేతిలో ముగ్గురు హీరోలున్నారు. అయితే వీళ్ల ముగ్గుర్లో ఎంతమంది పూరి కథకు ఓకే చెబుతారు… ఏ హీరో మొదట కాల్షీట్లు ఇస్తాడనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్, మహేష్, వెంకటేష్ ముగ్గురూ యమ బిజీగా ఉన్నారు. పూరి మాత్రం రోగ్ అనే చిన్న చిత్రంతో కాలక్షేపం చేస్తున్నాడు.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News