కరీంనగర్ కోర్టులో జబర్దస్త్ టీం!
అప్పుడెప్పుడో జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కమేడియన్ వేణుపై దాడి చేసిన విషయం తెలిసిందే! తమ సామాజిక వర్గానికిచెందిన మహిళలను కించపరిచారని ఆరోపిస్తూ.. వేణును పథకం ప్రకారం.. పిలిపించి దాడి చేశారు. అప్పట్లో అది పెద్ద వివాదమైంది. దీంతో అప్పటి నుంచి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదురవకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఇదే కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది […]
Advertisement
అప్పుడెప్పుడో జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కమేడియన్ వేణుపై దాడి చేసిన విషయం తెలిసిందే! తమ సామాజిక వర్గానికిచెందిన మహిళలను కించపరిచారని ఆరోపిస్తూ.. వేణును పథకం ప్రకారం.. పిలిపించి దాడి చేశారు. అప్పట్లో అది పెద్ద వివాదమైంది. దీంతో అప్పటి నుంచి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదురవకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఇదే కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది స్థానిక కోర్టులో కేసు వేశారు. దీంతో జబర్దస్త్ నిర్వాహకులతోపాటు, రోజా, నాగబాబు, రేష్మి, అనసూయ, చమ్మక్ చంద్ర, షేకింగ్ శేషు, పచ్చ మధు తదితర 22 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవిచారణలో భాగంగా జబర్దస్త్ టీం సభ్యులు చమ్మక్ చంద్ర, షేకింగ్ శేషు, పచ్చ మధు విచారణకు హాజరయ్యారు. మిగిలిన నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు హుజురాబాద్ పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి కేసు విచారణను జూన్ 30కి వాయిదా వేశారు.
అసలేం జరిగింది?
ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో లాయర్లపై చిత్రీకరించిన ఓ స్కిట్ న్యాయవాద వృత్తిని అవమానించేలా ఉందని హుజురాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ హుజురాబాద్ కోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కార్యక్రమంలో పాల్గొన్న వాందరినీ హాజరుకావాలని ఆదేశించింది.
Advertisement