సాక్షి మ‌హ‌రాజ్...ఈసారి...ఇలా చేశారు!

బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్ప‌దంగా మారారు. ఎప్పూడూ ఏదో ఒక సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉండే సాక్షి మ‌హ‌రాజ్ ఇప్పుడు తీవ్ర‌మైన వివాదంలోనే ఇరుక్కున్నారు. ఆ విష‌యం తాలూకూ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్లో తిరుగుతూ నెటిజ‌న్ల ఆగ్ర‌హాన్ని పెంచుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మైన‌పురిలో ఒక బిజెపి కార్య‌క‌ర్తకు పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన వివాదంలో, పోలీసులు, మ‌హిళా కానిస్టేబుళ్లు లేకుండా కార్య‌క‌ర్త‌ ఇంట్లోకి ప్ర‌వేశించి, అత‌ని కుమార్తెల‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని తెలుస్తోంది. దీనిపై స్పందించి సాక్షి మ‌హ‌రాజ్, ఆ కార్య‌క‌ర్త ని ప‌రామ‌ర్శించ‌డానికి అత‌ని […]

Advertisement
Update:2016-05-06 12:15 IST

బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్ప‌దంగా మారారు. ఎప్పూడూ ఏదో ఒక సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉండే సాక్షి మ‌హ‌రాజ్ ఇప్పుడు తీవ్ర‌మైన వివాదంలోనే ఇరుక్కున్నారు. ఆ విష‌యం తాలూకూ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్లో తిరుగుతూ నెటిజ‌న్ల ఆగ్ర‌హాన్ని పెంచుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మైన‌పురిలో ఒక బిజెపి కార్య‌క‌ర్తకు పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన వివాదంలో, పోలీసులు, మ‌హిళా కానిస్టేబుళ్లు లేకుండా కార్య‌క‌ర్త‌ ఇంట్లోకి ప్ర‌వేశించి, అత‌ని కుమార్తెల‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని తెలుస్తోంది. దీనిపై స్పందించి సాక్షి మ‌హ‌రాజ్, ఆ కార్య‌క‌ర్త ని ప‌రామ‌ర్శించ‌డానికి అత‌ని ఇంటికి వెళ్లారు. జ‌రిగిన సంగ‌తుల‌ను మ‌హిళ‌ల ద్వారా తెలుసుకుంటూ, పోలీసులు కొట్టిన దెబ్బ‌ల తాలూకూ గాయాలను చూప‌మంటూ, యువ‌తిని ప్యాంటుని తొల‌గించాల్సిందిగా కోరటం వీడియోలో రికార్డ‌యింది. అక్క‌డ మ‌హిళ‌ల‌తో పాటు పురుషులు కూడా ఉన్నారు. సాక్షి మ‌హ‌రాజ్ అలా అడ‌గ‌టంపై, ఉవ్వెత్తున వివాదం చెల‌రేగింది. ఒక మ‌హిళ, బాలిక ప్యాంటు బెల్టుని తీస్తుండ‌టం, సాక్షి అలాగే చూస్తూ ఉండ‌టం… వీడియోలో క‌నిపిస్తుండ‌గా… ఆయ‌న తీరు జుగుప్స‌ని క‌లిగించేలా ఉంద‌ని నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News