సోమారపు పంట పండింది!
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పంట పండింది. ఆయనను తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోల్‌బెల్ట్ ఏరియాలో గులాబీ పార్టీ నేతలు, ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి 2014లో తొలిసారిగా గులాబీపార్టీ నుంచి పోటీ చేసిన సత్యనారాయణ మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదేప్రాంతంనుంచి పార్టీ ఆవిర్భావం నుంచి చేస్తోన్న కొప్పుల ఈశ్వర్ కి సైతం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అధిష్టానం సత్యనారాయణను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. త్వరలో […]
Advertisement
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పంట పండింది. ఆయనను తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోల్‌బెల్ట్ ఏరియాలో గులాబీ పార్టీ నేతలు, ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి 2014లో తొలిసారిగా గులాబీపార్టీ నుంచి పోటీ చేసిన సత్యనారాయణ మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదేప్రాంతంనుంచి పార్టీ ఆవిర్భావం నుంచి చేస్తోన్న కొప్పుల ఈశ్వర్ కి సైతం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అధిష్టానం సత్యనారాయణను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కొప్పులకు తప్పక అవకాశం ఉంటుంది కాబట్టి నామినేటెడ్ పోస్టులో సోమారపును కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. తాజా నియాయకంపై సోమారపు సత్యనారయణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు పార్టీలో దక్కిన ప్రాధాన్యానికి ఆయన అనుచరులు పండగ చేసుకుంటున్నారు..
సోమారపు రాజకీయ జీవితాన్ని పరికిస్తే…
ఆయన రాజకీయ ఆరంగ్రేట్రం కాంగ్రెస్ నుంచి జరిగింది 1998లో రామగుండం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి తరువాత మునిసిపల్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2003లో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కావాలన్న కోరికతో తనకు ఇష్టం లేకున్నా అధిష్టానం చెప్పిందన్న కారణంతో అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పోటీగా మంథని నుంచిపోటీ చేసి ఓడిపోయారు. తరువాత రామగుండం ఎస్సీ నుంచి జనరల్కు మారింది. ఇదే సమయంలో 2009లో మహాకూటమి పొత్తులో రామగుండం నియోజకవర్గం గులాబీ పార్టీకి దక్కింది. ఇక్కడ సింగరేణి కార్మికులు అధికం కాబట్టి గులాబీపార్టీకి తిరుగుండదు అనుకున్నారంతా. కానీ, కూటమి చీలిపోవడంతో టీడీపీ కూడా పోటీ చేయాల్సి వచ్చింది. కానీ, టీడీపీ అధినేత రామగుండం టికెట్‌ను హడావుడిగా సత్యనారాయణకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, బీఫారమ్‌ను అందివ్వడంలో తీవ్ర జాప్యం చేయడంతో సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సి వచ్చింది. అయినా, కార్మికుల బలం ఉండటంతో స్వతంత్య్ర అభ్యర్తిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన కొంతకాలం కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నా.. ఏపార్టీలో చేరలేదు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మకులతో కలిసి ఉద్యమబాటపట్టారు. ఈ నేపథ్యంలోనే 2011లో గులాబీపార్టీలో చేరారు. 2014లో గులాబీపార్టీ టికెట్‌తో మరోసారి రామగుండం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌గా నియమితులవ్వడంపై సోమారపు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
Advertisement