హరీశ్- కేటీఆర్‌లు కలిసే ఉన్నారా?
ఇటీవల జరిగిన మంత్రి వర్గ శాఖల్లో మార్పు పలు ఊహాగానాలకు తెరలేపింది. పనితీరు ఆధారంగా శాఖల మార్పు జరిగిందా? అసలు ఇవి ప్రమోషన్లా..? డిమోషన్లా? అన్న సంగతి ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ప్రతిపక్షాలు, పత్రికలలో ఈ శాఖల మార్పుపై చర్చలు విశ్లేషణలు మొదలయ్యాయి. తలసాని, హరీశ్‌ల నుంచి అదనంగా ఉన్న శాఖలను మార్చడం చర్చానీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ తన కుమారుడి రాజకీయ ప్రాబల్యం పెంచడం కోసం మేనల్లుడు హరీశ్ ప్రాబల్యాన్ని తగ్గిస్తున్నారన్న ప్రచారం మొదలైంది. […]
Advertisement
ఇటీవల జరిగిన మంత్రి వర్గ శాఖల్లో మార్పు పలు ఊహాగానాలకు తెరలేపింది. పనితీరు ఆధారంగా శాఖల మార్పు జరిగిందా? అసలు ఇవి ప్రమోషన్లా..? డిమోషన్లా? అన్న సంగతి ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ప్రతిపక్షాలు, పత్రికలలో ఈ శాఖల మార్పుపై చర్చలు విశ్లేషణలు మొదలయ్యాయి. తలసాని, హరీశ్‌ల నుంచి అదనంగా ఉన్న శాఖలను మార్చడం చర్చానీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ తన కుమారుడి రాజకీయ ప్రాబల్యం పెంచడం కోసం మేనల్లుడు హరీశ్ ప్రాబల్యాన్ని తగ్గిస్తున్నారన్న ప్రచారం మొదలైంది. వీటన్నింటికీ ఆ పార్టీ ఎంపీ కవిత సమాధానం ఇచ్చారు. హరీశ్- కేటీఆర్ పార్టీకి రెండు కళ్లలాంటి వారని చెప్పారు. హరీశ్‌కు అదనంగా బాధ్యతలు ఉన్నాయని, ఆయన కోరితేనే సీఎం ఆయన అదనపు శాఖల నుంచి తప్పించారని వివరణ ఇచ్చారు. అంతే తప్ప మీడియాలో జరుగుతున్న ప్రచారమేదీ నిజం కాదని తేల్చిచెప్పారు. ఇక మీదట శాఖల మార్పుపై ఎలాంటి ఊహాజనిత కథనాలు రాయవద్దని పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి చర్చ ఎందుకు వచ్చిందంటే..?
గతేడాది వరంగల్ ఉప- ఎన్నిక సందర్బంగా హరీశ్‌కు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో ఈ రచ్చ మొదలైంది. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ రావుకు ఆ ఎన్నిక సందర్బంగా కేవలం ఒక నియోజకవర్గపు బాధ్యతలు మాత్రమే అప్పగించడం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. ఉమ్మడి ఏపీలో టీఆర్ ఎస్ ఏ ఉప ఎన్నికలో పోటీ చేసినా హరీశ్ అన్ని బాధ్యతలు చూసుకునేవాడు. అలాంటిది ఆయనకు ఉన్న బాధ్యతలు తగ్గించడంతోనే ఇలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. తరువాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ హరీశ్‌ను దూరంగానే పెట్టారు. మొత్తం బాధ్యతలు కేటీఆర్‌కు అప్పజెప్పారు. తరువాత నారాయణఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పజెప్పినా.. తాజాగా పాలేరు ఉప ఎన్నికకు సైతం హరీశ్ ను దూరంగా పెట్టడంతో మీడియాలో దీనిపైపలు విశ్లేషణలు మొదలయ్యాయి, అందుకే, ఎంపీ కవిత దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Advertisement