తలసానికి ఇది ప్రమోషనా.. డిమోషనా..!
తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం అధికారపార్టీలో చేరి మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీలో తొలి నుంచి మంచిప్రాధాన్యమే దక్కింది. అయితే, తాజాగా జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో తలసాని శాఖ కేటాయింపుల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కీలకంగా ఉండే.. వాణిజ్యశాఖల మార్పు మాత్రం చర్చనీయాంశంగా మారనుంది. ఇప్పటికిప్పుడు తలసాని పనితీరుపై సీఎం కేసీఆర్ గానీ, పార్టీ నేతలు గానీ ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కాకపోతే.. ఇటీవల జరిగిన కొన్ని […]
Advertisement
తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం అధికారపార్టీలో చేరి మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీలో తొలి నుంచి మంచిప్రాధాన్యమే దక్కింది. అయితే, తాజాగా జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో తలసాని శాఖ కేటాయింపుల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కీలకంగా ఉండే.. వాణిజ్యశాఖల మార్పు మాత్రం చర్చనీయాంశంగా మారనుంది. ఇప్పటికిప్పుడు తలసాని పనితీరుపై సీఎం కేసీఆర్ గానీ, పార్టీ నేతలు గానీ ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కాకపోతే.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల మంత్రికి కీలకమైన శాఖలు దూరమయ్యాయా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాటోగ్రఫీ, వాణిజ్యపన్నుల రాష్ట్ర వ్యాప్త శాఖలైనా వీటిలో సింహభాగం నగరానికే పరిమితం. అందుకే, నగరంపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ శాఖలను తలసానికే అప్పగించారు కేసీఆర్. వీటిని సమర్ధంగా నిర్వహించినందుకే తాజాగా బీసీ సంక్షేమ శాఖను అప్పగిస్తున్నారని కొందరు అంటుండగా..కీలకమైన వాణిజ్య శాఖలను తప్పించడం వెనక ఆయన కుటుంబ సభ్యులపై ఇటీవల చెలరేగిన పుకార్లు కారణమనే వారు లేకపోలేదు. వాటిని ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి ఖండిస్తూనే వచ్చారు.. తలసాని. అయితే, ఇలాంటి వివాదాలు సాధారణమే అని.. కొట్టి పారేసినా.. అవి ఎంతో కొంత ప్రభావం చూపించి ఉండవచ్చని వాదించే వారూ లేకపోలేదు. తెలంగాణలో బీసీల సంఖ్య అధికం. బీసీ నేతగా ఆ వర్గపు సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టే కేసీఆర్ తలసానికి ఆ శాఖను అప్పగించారని తెలుస్తోంది. అందుకే.. ఇది తలసానికి డిమోషన్ .. కాదు.. ప్రమోషన్ అని బల్లగుద్ది చెబుతున్నారు గులాబీదళ నేతలు.
Advertisement