బాలకృష్ణ వద్దకు కేసీఆర్ వెళ్లింది అందుకేనా?
యువరత్న బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ తొలిక్లాప్‌ను కేసీఆరే కొట్టారు. ఇప్పుడు దీనిపైనా దుమారం రేగుతోంది. తెలంగాణలో వివాదాస్పద నేతగా పేరొందిన టీడీపీ నేత రేవంత్ దీనికి కొత్త భాష్యం చెబుతున్నారు. పాలేరు ఉప ఎన్నికలో సెటిలర్ల మెప్పు పొందేందుకు బాలకృష్ణ సినిమాకు కేసీఆర్ అతిథిగా వెళ్లారని, అక్కడ ఎన్టీఆర్‌ను అందుకే పొగిడాడని ఆరోపిస్తున్నారు. విమానాశ్రయాల్లో ఎన్టీఆర్ పేరును, ఫొటోను వ్యతిరేకించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఎన్టీఆర్ గొప్పవాడు ఎలా అయ్యాడు? అని పాయింట్ […]
Advertisement
యువరత్న బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ తొలిక్లాప్‌ను కేసీఆరే కొట్టారు. ఇప్పుడు దీనిపైనా దుమారం రేగుతోంది. తెలంగాణలో వివాదాస్పద నేతగా పేరొందిన టీడీపీ నేత రేవంత్ దీనికి కొత్త భాష్యం చెబుతున్నారు. పాలేరు ఉప ఎన్నికలో సెటిలర్ల మెప్పు పొందేందుకు బాలకృష్ణ సినిమాకు కేసీఆర్ అతిథిగా వెళ్లారని, అక్కడ ఎన్టీఆర్‌ను అందుకే పొగిడాడని ఆరోపిస్తున్నారు. విమానాశ్రయాల్లో ఎన్టీఆర్ పేరును, ఫొటోను వ్యతిరేకించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఎన్టీఆర్ గొప్పవాడు ఎలా అయ్యాడు? అని పాయింట్ లాగుతున్నారు రేవంత్. ఇదంతా ఎన్నికల స్టంటనీ.. పాలేరులో గెలిచేందుకు కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగడ అని విమర్శిస్తున్నారు.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నిక సందర్భంగా కూడా సెటిలర్లను కేసీఆర్ పొగిడి విజయం సాధించాడని, ఇప్పుడు కూడా అదే ఫార్ములా వాడుతున్నాడని మండిపడుతున్నారు.
బాలకృష్ణే పిలిచాడు కదా!
అయితే, రేవంత్ కామెంట్లపై గులాబీ నేతలు జాలిపడుతున్నారు. పాలేరులో ఓడిపోతామని ముందుగానే తెలుసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రజలు విశ్వసించడం లేదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ, ఈ కార్యక్రమానికి యువరత్న బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ స్వయంగా తెలంగాణ సచివాలయానికి వెళ్లి మరీ… కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈవార్త చిత్రాలతో సహా రెండు రాష్ర్టాల మీడియాల్లో ప్రధానవార్తగా ప్రసారమైంది. మరి, అలాంటప్పుడు కేసీఆర్ పనిగట్టుకుని వెళ్లలేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు గులాబీనేతలు. సెటిలర్ల రక్షణే ప్రధాన అజెండాగా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీకి ప్రజలు ఒకే ఒక్క స్థానం కట్టబెట్టిన సంగతి మరవద్దని గుర్తు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట పురపాలికల ఎన్నికల్లో ఆ పార్టీని జనం బొంద పెట్టినా ఇలాంటి కామెంట్లు చేయడం ఆపార్టీ దిగజారుడు తననానికి నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు.
Advertisement