పాలేరులో తుమ్మలనే ఎందుకు?
ఖమ్మం జిల్లా పాలేరుకు మే 16న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారోనని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావును అభ్యర్థిగా ప్రకటించి మిగిలిన పార్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీఎం నిర్ణయంతో గులాబీ పార్టీలో సంబరాలు జరుగుతుంటే.. కాంగ్రెస్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. గతంలో పాలేరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాంరెడ్డి […]
Advertisement
ఖమ్మం జిల్లా పాలేరుకు మే 16న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారోనని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావును అభ్యర్థిగా ప్రకటించి మిగిలిన పార్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీఎం నిర్ణయంతో గులాబీ పార్టీలో సంబరాలు జరుగుతుంటే.. కాంగ్రెస్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. గతంలో పాలేరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ టీఆర్ ఎస్ అభ్యర్థి గా ఎవరు పోటీ చేస్తారన్న సందిగ్దతకు కేసీఆర్ తెరదించారు.
ఖమ్మంలో పాగా వేసేందుకు…
తెలంగాణలో ఉద్యమపార్టీగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న గులాబీ పార్టీ ఖమ్మంలో మాత్రం ఇంతవరకూ పాగా వేయలేకపోయింది. ఆ వెలితి సీఎం కేసీఆర్ మదిలోనూ ఉంది. అందుకే, జిల్లాలో పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. దీని ప్రకారం.. తొలుత ఆజిల్లాలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఖమ్మంలో బలమైన నేతగా పేరొందిన తుమ్మలను సైతం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సామాజికవర్గం ప్రజలు అధికంగా ఉండటం కూడా ఇందుకు కారణమే. తుమ్మల రాకతో జిల్లాలో పార్టీ కేడర్ బలపడిందని చెప్పాలి. మంత్రి పదవి ఇవ్వడంతో మరింత ఉత్సాహంగా పనిచేశారు తుమ్మల. ఇటీవల కార్పోరేషన్ ను గులాబీ పార్టీ కైవసం చేసుకోవడంలో తుమ్మల కృషి ఎంతైనా ఉంది. ఎన్ని చేసినా.. జిల్లా నుంచి నేరుగా అసెంబ్లీకి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవడం ప్రతిపక్షాలకు విమర్శనాస్ర్తాలుగా మారుతున్నాయి. దీన్ని అధిగమించాలంటే.. ఎలాగైనా పాలేరుగులో గులాబీ జెండా ఎగరేయాలి. అందుకే తుమ్మల కంటే సమర్థుడు ఇంకెవరు ఉంటారు.. సీఎం భావించినట్లు తెలుస్తోంది. అందుకే, ఈసీ షెడ్యూలు ప్రకటించిన వెంటనే తుమ్మల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
Advertisement