సీఎం కేసీఆర్ కు జ్వరం ఎందుకు వచ్చింది?
బాగుంది.. ఇదేం ప్రశ్న? చీమా.. చీమా.. నన్నెందుకు కుట్టావ్? అన్నట్లుగా ఉంది మీ తీరు.. అని అనుకుంటున్నారా? మరేం లేదండి.. సీఎం స్థాయి వ్యక్తి కదా! ఆయనకు జ్వరం వచ్చిందంటే.. మరి సంచలన వార్తే కదా! ఇప్పుడు ఈ విషయంపై ఇంకెవరో చర్చించుకుంటే అసలు అది విషయమే కాదు. సామాన్యులు చర్చించుకుంటున్నారు. సీఎంకు అస్వస్థత అని వార్తల్లో చూసిన జనం.. అది ఎందుకు వచ్చింది? అని తమలో తామే అనుకుంటున్నారు. ఈనెల 15న భద్రాచలంలో సీతారాముల కల్యాణం […]
Advertisement
బాగుంది.. ఇదేం ప్రశ్న? చీమా.. చీమా.. నన్నెందుకు కుట్టావ్? అన్నట్లుగా ఉంది మీ తీరు.. అని అనుకుంటున్నారా? మరేం లేదండి.. సీఎం స్థాయి వ్యక్తి కదా! ఆయనకు జ్వరం వచ్చిందంటే.. మరి సంచలన వార్తే కదా! ఇప్పుడు ఈ విషయంపై ఇంకెవరో చర్చించుకుంటే అసలు అది విషయమే కాదు. సామాన్యులు చర్చించుకుంటున్నారు. సీఎంకు అస్వస్థత అని వార్తల్లో చూసిన జనం.. అది ఎందుకు వచ్చింది? అని తమలో తామే అనుకుంటున్నారు. ఈనెల 15న భద్రాచలంలో సీతారాముల కల్యాణం అనంతరం ఆయన అస్వస్థతకు గుర్యయారు. ఈ నేపథ్యంలో మూడురోజుల పాటు అన్ని అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ఆదివారం ప్రకటన వెలువడింది.
కొంతకాలంగా రాష్ట్ర వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుపెన్నడూ చూడని ఎండలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మిగిలిన వారు వడదెబ్బలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వాతావరణంలో జరుగుతున్న ఈ ఆకస్మిక మార్పులకు అనుగుణంగా శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా కొన్ని మార్పులు చేసుకుంటుంది. ఈ సంధికాలాన్ని తట్టుకోలేని శరీరాలు అస్వస్థతకు గురవుతాయి. అసలే సీఎం. క్షణం తీరికలేకుండా గడుపుతారు. కాబట్టి కేసీఆర్ అస్వస్థతకు వాతావరణ మార్పులే కారణమై ఉంటాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. సూర్యుడికి సీఎం అయినా.. సామాన్యుడైనా ఒకటే కదా! అని గుర్తు చేస్తున్నారు.
Advertisement