డీకే అరుణకు స్ట్రాంగ్ వార్నింగ్!
టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీని విమర్శిస్తే.. సహించేది లేదని స్పష్టంచేశారు. ఉద్యమ సమయంలో రాజీనామాలకు భయపడి పారిపోయి…. ఇప్పుడు మాట్లాడటం పిరికి చర్యగా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తనతమ్ముడు టీఆర్ ఎస్‌లో చేరడంపై డీకే అరుణ స్పందించారు. టీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. పనిలోపనిగా మంత్రి జూపల్లిని జూలోపిల్లి అంటూ హేళన చేస్తూ మాట్లాడారు. దీనిపై గువ్వల బాలరాజు తీవ్ర […]
Advertisement
టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీని విమర్శిస్తే.. సహించేది లేదని స్పష్టంచేశారు. ఉద్యమ సమయంలో రాజీనామాలకు భయపడి పారిపోయి…. ఇప్పుడు మాట్లాడటం పిరికి చర్యగా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తనతమ్ముడు టీఆర్ ఎస్‌లో చేరడంపై డీకే అరుణ స్పందించారు. టీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. పనిలోపనిగా మంత్రి జూపల్లిని జూలోపిల్లి అంటూ హేళన చేస్తూ మాట్లాడారు. దీనిపై గువ్వల బాలరాజు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. పాలమూరు వలసలకు 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీయే కారణం కాదా? అని ప్రశ్నించారు.
పాలమూరు ప్రజలు ఈ రోజు దుస్థితికి ముమ్మాటికీ కాంగ్రెస్ పాలనే కారణమని దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో జూపల్లి ఒకరే రాజీనామా చేశారని, మిగిలిన కాంగ్రెస్ నేతలు పలాయనం చిత్తగించారని గుర్తు చేశారు. జూపల్లి పిల్లి కాదని, పులి అని అభివర్ణించారు. ఉద్యమ సమయంలో తాము చేసిన త్యాగాలను గుర్తించి ప్రజలు గెలిపించారని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల్లో అవినీతి ఉందన్న నాగం జనార్ధన్రెడ్డి కేసు కోర్టులో నిలవలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై డీకే అరుణ చేస్తున్న వాదనలోనూ పసలేదని కొట్టిపారేశారు. ప్రజలకు ముఖం చూపించలేక ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఆయన మండిపడ్డారు.
Advertisement