అవసరమైతే బిచ్చమెత్తుకుంటా...

డీకే అరుణ త‌మ్ముడు చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి కారు పార్టీలో చేరారు. త‌న త‌మ్ముడు ఏ పార్టీలో చేరినా.. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తన తమ్ముడు చేసిన పనితో తన తండ్రి నర్సిరెడ్డి  ఆత్మక్షోభిస్తుందని చెప్పారు.  కుటుంబాల్లో చిచ్చుపెట్టి కేసీఆర్‌ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తమను ఆర్థికంగా దెబ్బకొట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని … ఒకవేళ అదే జరిగితే అవసరమైతే బిచ్చమెత్తుకుని బతుకుతామే గానీ లొంగిపోయే రకం తాముకాన్నారు డీకే అరుణ.  టీఆర్ఎస్ పార్టీలోకి మాత్రం […]

Advertisement
Update:2016-04-14 06:13 IST

డీకే అరుణ త‌మ్ముడు చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి కారు పార్టీలో చేరారు. త‌న త‌మ్ముడు ఏ పార్టీలో చేరినా.. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తన తమ్ముడు చేసిన పనితో తన తండ్రి నర్సిరెడ్డి ఆత్మక్షోభిస్తుందని చెప్పారు. కుటుంబాల్లో చిచ్చుపెట్టి కేసీఆర్‌ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తమను ఆర్థికంగా దెబ్బకొట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని … ఒకవేళ అదే జరిగితే అవసరమైతే బిచ్చమెత్తుకుని బతుకుతామే గానీ లొంగిపోయే రకం తాముకాన్నారు డీకే అరుణ. టీఆర్ఎస్ పార్టీలోకి మాత్రం వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తనకు తన తండ్రి ఆశయాలకు రామ్మోహన్ రెడ్డి మచ్చతెచ్చారని అన్నారు. నియోజకవర్గం లో కార్యకర్తలెవరూ కూడా రామ్మోహన్ వెంట వెళ్ళలేదని ఆమె అన్నారు.

డీకే అరుణ టీ ఆర్ ఎస్ పార్టీలో చేరకపోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు. కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ఉన్నప్పుడే డీకే అరుణ భ‌ర్త భ‌ర‌త సింహా రెడ్డి అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారం సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లింది. ఈ విష‌యంలో కోర్టు ఏకంగా అప్పట్లోనే రూ.33 కోట్ల జ‌రిమానా విధించింది. అయితే మంత్రిగా ఉన్న స‌మ‌యంలో డీకే అరుణ అధికారుల‌ను మేనేజ్ చేసుకుని ఈ అక్ర‌మ మైనింగ్ కొన‌సాగించార‌ని తేలింది. ఈ వ్య‌వ‌హారంను బట్టబయలు చేసి ఆపై టీఆ ర్ ఎస్ ప్ర‌భుత్వం మరింత‌ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన‌ కారణంగా డీకే అరుణ ఆ పార్టీపై కోపం పెంచుకున్నారని అంటారు. ఇటీవల జూబ్లీహిల్స్ కూడలిలోని డీకే అరుణకు చెందిన కోట్లు విలువ చేసే భూమిని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోవ‌డంతో డీకే మ‌రింత డీలా ప‌డ్డారు. దాంతో ఆమె గులాబీ పార్టీపై మ‌రింత మండిప‌డుతూనే ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News