108 ఉద్యోగుల నెత్తిన పాలుపోసిన కేసీఆర్
రోడ్డు ప్రమాదాలు, ఆపద సమయాల్లో వెంటనే వైద్యసాయాలందించే 108 ఉద్యోగులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు తక్షణ సాయం అందించే 108, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే 104 ఉద్యోగుల వేతనాలు సవరించాల్సిన అవసరముందని సీఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో 108 ఉద్యోగి రమేశ్‌తో జరిపిన ముఖాముఖిలో 108 ఉద్యోగుల వెతలు […]
Advertisement
రోడ్డు ప్రమాదాలు, ఆపద సమయాల్లో వెంటనే వైద్యసాయాలందించే 108 ఉద్యోగులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు తక్షణ సాయం అందించే 108, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే 104 ఉద్యోగుల వేతనాలు సవరించాల్సిన అవసరముందని సీఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో 108 ఉద్యోగి రమేశ్‌తో జరిపిన ముఖాముఖిలో 108 ఉద్యోగుల వెతలు సీఎం తెలుసుకున్నాడు. లక్ష జనాభాకు ఒక 108 అంబులెన్సు మాత్రమే ఉండేదని, తాము వచ్చాక 75 వేలకు ఒక అంబులెన్స్‌ను తీసుకువచ్చామని గుర్తుకు చేశారు. ఫలితంగా 169 వాహనాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మరో 145 అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు.
సీఎం నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు…!
చాలా కాలంగా 108లో పనిచేస్తున్నా.. వేతనాల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వీరంతా ఆర్థికంగా చితికిపోయారు. ఒకదశలో అంతా కలిసి ఆందోళన చేసినా.. పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వీరి పరిస్థితి కాస్త మెరుగుపడింది. అదనపు అంబులెన్సులతోపాటు.. వేతనాలు పెంచాలని తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయంతో 108 ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను తక్షణమే ఆదుకోవడానికి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన వినూత్న పథకం 108 అంబులెన్సులు. ఇవి అందుబాటులోకి వచ్చాక రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీనికి చక్కటి ప్రశంసలు రావడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాలు 108 సర్వీసులను ప్రవేశపెట్టడం విశేషం.
Advertisement