దేవుడి కరుణకై కేసీఆర్ కోటి ఆశలు
ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వార్తలు కరువుతో అల్లాడుతున్న తెలంగాణప్రజలను సంతోషపెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం ఈ రుతుపవనాలపై కోటి ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో నీటి ఎద్దడి తాగు, సాగునీటి కరవులను నివారించేందుకు మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ పేర్లతో ప్రాజెక్టులు చేపట్టడమే ఇందుకు కారణం. దశాబ్దాలకాలంగా తెలంగాణలో తాగు-సాగు నీటి కరవు కొనసాగుతోంది. ఇక్కడ జీవ నదులు ఉన్నా.. వ్యవసాయానికి ఆశాజనకమైన పరిస్థితులు లేవు. అందుకే కాకతీయుల కాలంలో తవ్విన చెరువుల పరిరరక్షణ, పునరుద్ధరణ చేపట్టాడు సీఎంకేసీఆర్. […]
ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వార్తలు కరువుతో అల్లాడుతున్న తెలంగాణప్రజలను సంతోషపెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం ఈ రుతుపవనాలపై కోటి ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో నీటి ఎద్దడి తాగు, సాగునీటి కరవులను నివారించేందుకు మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ పేర్లతో ప్రాజెక్టులు చేపట్టడమే ఇందుకు కారణం. దశాబ్దాలకాలంగా తెలంగాణలో తాగు-సాగు నీటి కరవు కొనసాగుతోంది. ఇక్కడ జీవ నదులు ఉన్నా.. వ్యవసాయానికి ఆశాజనకమైన పరిస్థితులు లేవు. అందుకే కాకతీయుల కాలంలో తవ్విన చెరువుల పరిరరక్షణ, పునరుద్ధరణ చేపట్టాడు సీఎంకేసీఆర్. దీనికి మిషన్ కాకతీయ పేరు పెట్టి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాడు.
మంత్రి హరీష్‌రావు పనులను సమీక్షిస్తున్నా.. సీఎంమాత్రం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇక రెండోది మిషన్ భగీరథ తెలంగాణలోని ప్రతి ఊరికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న బృహత్ సంకల్పంతో చేపట్టిన పథకం ఇది. ఈ రెండు ప్రాజెక్టుల్లో ముఖ్యంగా మిషన్ కాకతీయ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. చెరువుల తవ్వకాలు, తూముల రిపేర్లు, చెరువు కట్టల పునరుద్ధరణ తదితర పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనులు పూర్తయినా.. వర్షపాతం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎన్నో నిధులు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టులు కావడంతో వీటి లక్ష్యం నెరవేరాలంటే వర్షాలు చాలా కీలకం. ఇక వరుణ దేవుడు కరుణిస్తే.. చెరువులు నిండటం ఖాయం. ఈ దఫా తెలంగాణలో రెండో పంట కు కూడా సాగునీరు అందించగలిగన వారిమవుతామని తెలంగాణ ప్రభుత్వం కోటి దేవుళ్లకు మొక్కుతోంది. ఈసారి వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందన్న వాతావరణ శాఖ నివేదికలు ఇటు తెలంగాణ ప్రజల్లో.. అటు తెలంగాణ ముఖ్యమంత్రిలో కోటి ఆశలు రేపుతున్నాయి.