వెంకయ్య పంచెలో ఏముంది: నారాయణ
సీపీఐ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఆత్మహత్య తరువాత వర్సిటీలో ఉద్రిక్తతలు చెలరేగడంతో వీసీ అప్పారావు సెలవులపై వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల వీసీ అప్పారావు తిరిగి విధుల్లో చేరడాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి వీసీ రాజీనామా చేయాలని పోరాటం చేస్తున్నారు. వీరికి మద్దతుగా సీపీఐ నారాయణ కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. వీసీని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ.. ఇటీవల గవర్నర్ నివాసాన్ని […]
Advertisement
సీపీఐ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఆత్మహత్య తరువాత వర్సిటీలో ఉద్రిక్తతలు చెలరేగడంతో వీసీ అప్పారావు సెలవులపై వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల వీసీ అప్పారావు తిరిగి విధుల్లో చేరడాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి వీసీ రాజీనామా చేయాలని పోరాటం చేస్తున్నారు. వీరికి మద్దతుగా సీపీఐ నారాయణ కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. వీసీని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ.. ఇటీవల గవర్నర్ నివాసాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. వీసీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో నారాయణ కూడా మాటల వేడి పెంచుతున్నారు.
వీసీ అప్పారావుది దొంగ థీసీస్..?
హెచ్‌సీయూ అంశంపై ఆయన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై మాటలతో విరుచుకుపడ్డారు. దొడ్డిదారిలో వచ్చి హెచ్‌సీయూ వీసీగా అప్పారావు బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. థీసిస్ కాపీ కొట్టి పీహెచ్‌డీ చేసిన చదువు దొంగ అని వీసీ అప్పారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వర్సిటీల పరిస్థితిపై పంచె కట్టు పెద్దమనిషి మాట్లాడతారని అనుకున్నామని, ఆయన ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు అంతా నా పంచె వైపు చూస్తున్నారని అంటున్నారని, ఇంతకీ ఆయన పంచెలో ఏముందని చూడటానికి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Advertisement