ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కేసులే: పల్లా
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తున్న రాజకీయ నాయకులంతా ఇకపై జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే.. చూస్తూ ఊరుకోబోమని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రతిపక్షాలను హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వారిపై కేసులు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పరోక్షంగా టీడీపీ – […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తున్న రాజకీయ నాయకులంతా ఇకపై జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే.. చూస్తూ ఊరుకోబోమని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రతిపక్షాలను హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వారిపై కేసులు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పరోక్షంగా టీడీపీ – కాంగ్రెస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, నీటి లభ్యత, ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయాలను సీఎం కేసీఆర్ పూసగుచ్చినట్లు వివరించారన్నారు. సందేహాలుంటే నివృత్తి చేసుకోండి, అంతేగానీ, అవినీతి అంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తే.. ఇకపై సహించేది లేదన్నారు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంటే.. మీకెందుకు అర్థం కావడం లేదని వాపోయారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అభినందించారని గుర్తు చేశారు.
Advertisement