హృతిక్ రోషన్ కు రివర్స్ షాక్ ఇచ్చిన కంగన లాయర్..!
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరి మధ్య ఎలా ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టమే. క్రిష్ 3 చిత్రం సమయంలో కంగన రనౌత్, హృతిక్ రోషన్ ల మధ్య ఏదో ఉందనే రూమర్ బాలీవుడ్ లో హల్ చల్ చేసింది. కట్ చేస్తే .. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. హృతిక్ రోషన్ దంపతులు విడిపోయారు.కాలక్రమేనా హృతిక్ కంగనా మధ్య కూడా గ్యాప్ పెరిగింది. ఆషికి చిత్రం మూడో సీక్వెల్ లో హృతిక్ రోషన్ .. కంగన […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరి మధ్య ఎలా ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టమే. క్రిష్ 3 చిత్రం సమయంలో కంగన రనౌత్, హృతిక్ రోషన్ ల మధ్య ఏదో ఉందనే రూమర్ బాలీవుడ్ లో హల్ చల్ చేసింది. కట్ చేస్తే .. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. హృతిక్ రోషన్ దంపతులు విడిపోయారు.కాలక్రమేనా హృతిక్ కంగనా మధ్య కూడా గ్యాప్ పెరిగింది. ఆషికి చిత్రం మూడో సీక్వెల్ లో హృతిక్ రోషన్ .. కంగన ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడలేదనే వార్తను కంగన ఇగోని బాగానే దెబ్బతీసింది. ఒక మాజి ప్రేమికుడు తన కెరీర్ కు దురుద్దేశంగా అడ్డు పుల్లలు వేస్తున్నాడంటూ మీడియా ముందు స్టేట్ మెంట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా కండల వీరుడు హృతిక్ రోషన్.. ఏకంగా తన పరువును మీడియా ముందు కీడిస్తూ.. ఇబ్బంది పెడుతుందని లీగల్ నోటిసు ఇప్పించారు.
కంగన ఒక మానసిక సమస్యతో బాధ పడుతుందని.. దాని ఎఫెక్ట్ తో తనకు దాదాపు 2 వేల ఈ మెయిల్స్ వరకు ఇచ్చిందని.. తను రెస్పాండ్ అవ్వక పోయినా.. రోజుకు 50 నుంచి 100 ఈ మెయిల్స్ ఇచ్చినట్లు ఇన్ బాక్స్ లో ఉన్నాయంటూ హృతిక్ చెప్తున్నారు. ఓవరాల్ గా ఇద్దరి మధ్య బాగానే చెడింది. ఒకరి పరువు.. ఒకరు తీసుకుంటున్నారు. దీంతో తాజాగా కంగన లాయర్ హృతిక్ కు నోటిసు పంపించారట. కంగన పై పెట్టిన కేసు అర్దం లేనదని.. హృతిక్ త్వరగా కేసు ను విత్ డ్రా చేసుకోవడం మంచిదని కంగన లాయర్ సిద్దికి హృతిక్ రోషన్ కు నోటిసు పంపించారట. మరిప్పుడు హృతిక్ ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.