తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ దారి ఎటు?
తెలంగాణలోని ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. బయటికి వచ్చి విమర్శల బాణాలు ఎక్కు పెట్టింది. టీపీసీసీ ప్రెసిడెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీమంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శిస్తుంటే.. మరి కొందరు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటూ ఇలాంటి పరస్పరం విభిన్న ప్రకటనలు చేస్తుండటంతో […]
తెలంగాణలోని ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. బయటికి వచ్చి విమర్శల బాణాలు ఎక్కు పెట్టింది. టీపీసీసీ ప్రెసిడెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీమంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శిస్తుంటే.. మరి కొందరు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటూ ఇలాంటి పరస్పరం విభిన్న ప్రకటనలు చేస్తుండటంతో కిందిస్థాయి నేతల్లో గందరగోళం నెలకొంది. పార్టీ అంటూ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత.. అది నచ్చినా నచ్చకున్నా.. దానికే కట్టుబడి ఉండాలి. అయితే, ఇక్కడ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్‌పార్టీలో స్వేచ్ఛ కొంచెం ఎక్కువే! అయితే పార్టీ విధానాన్ని ప్రశ్నించేలా ఉండటమే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడికి తలనొప్పిలా తయారైంది. పార్టీలో జాతీయ స్థాయి నాయకులైన పాల్వాయి గోవర్దన్ రెడ్డి, సీనియర్ మోస్ట్ నాయకులు జానారెడ్డి వ్యవహార శైలితో కాంగ్రెస్ కార్యర్తలు, అభిమానులు, ప్రజల్లోనూ గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో కేసీఆర్ పవర్ ప్రజెంటేషన్ లో పాల్గొనాల్సిందని తాజాగా సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి బహిరంగంగా కామెంట్లు చేయడం పార్టీకి ఇబ్బందిగా మారింది.