టీడీపీ ఇక ఒంటరి- పొత్తు ఉండదని ప్రకటించిన కేంద్రమంత్రి

తెలంగాణలో టీడీపీకి కటీఫ్ చెప్పేస్తోంది బీజేపీ.  ఇకపై ఒంటిరిగానే పోరాటం చేయాలని నిర్ణయించుకుంది.  ఈ విషయాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్వయంగా మీడియాకు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. ఎలాంటి పొత్తులు ఉండవని ప్రకటించారు . తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని అన్నారు.  ఆదివారం హైదరాబాద్ కొంపల్లిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా దత్తాత్రేయ ఈ ప్రకటన చేశారు.  తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శనివారం కేబినెట్ […]

Advertisement
Update:2016-04-03 09:20 IST

తెలంగాణలో టీడీపీకి కటీఫ్ చెప్పేస్తోంది బీజేపీ. ఇకపై ఒంటిరిగానే పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్వయంగా మీడియాకు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. ఎలాంటి పొత్తులు ఉండవని ప్రకటించారు . తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని అన్నారు. ఆదివారం హైదరాబాద్ కొంపల్లిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా దత్తాత్రేయ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శనివారం కేబినెట్ భేటీ అనంతరం టీడీపీ సీనియర్లతో చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో 2019లో ఎలాంటి పొత్తులు ఉండవని దత్తాత్రేయ ప్రకటించడం గమనార్హం. విభజన హామీలను ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని ఈ విషయం చంద్రబాబుకూ తెలుసన్నారు. విడతల వారీగా అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్ తోనూ పొత్తు ప్రసక్తే ఉండదన్నారు.

మొన్న జరిగిన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటిరిగానే పోటీ చేసింది. అక్కడ టీడీపీ కంటే బీజేపీయే ఎక్కువ ఓట్లు సాధించింది. టీడీపీకి తోకపార్టీగా ఉండడం వల్లే బీజేపీ బలపడలేకపోతోందన్న అభిప్రాయం కూడా కమలనాథుల్లో ఉంది. ఇక ఏపీలోనూ టీడీపీ, బీజేపీ మధ్య ఇటీవల సంబంధాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. అయితే వెంకయ్యనాయుడుతో పాటు బీజేపీలో తనకు అనుకూలంగా ఉన్న నాయకుల సాయంతో చంద్రబాబు నెట్టుకొస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

Click on Image to Read:

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News