సర్దార్ తో పోటీపడుతున్న వెంకటేశ్

నిజానికి పవన్, వెంకీ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గోపాల గోపాల అనే సినిమాలో కూడా నటించారు. కానీ ఫ్రెండ్ షిప్ వేరు సినిమాలు వేరు. పోటీ అనేది సహజం. ఇప్పుడు ఈ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య పోటీ షురూ అయింది. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ గా పవన్ థియేటర్లలోకి వస్తుంటే… అదే రోజును వెంకీ కూడా టార్గెట్ చేశాడు. తన కొత్త సినిమా బాబు బంగారం ఫస్ట్ లుక్ ను ఆ రోజునే […]

Advertisement
Update:2016-03-23 07:47 IST
నిజానికి పవన్, వెంకీ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గోపాల గోపాల అనే సినిమాలో కూడా నటించారు. కానీ ఫ్రెండ్ షిప్ వేరు సినిమాలు వేరు. పోటీ అనేది సహజం. ఇప్పుడు ఈ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య పోటీ షురూ అయింది. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ గా పవన్ థియేటర్లలోకి వస్తుంటే… అదే రోజును వెంకీ కూడా టార్గెట్ చేశాడు. తన కొత్త సినిమా బాబు బంగారం ఫస్ట్ లుక్ ను ఆ రోజునే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతానికి బాబు బంగారం షూటింగ్ నత్తనడకన సాగుతోంది. నయనతార ఇంకా సెట్స్ పైకి రాకపోవడంతో… సినిమా షూటింగ్ ఆలస్యమౌతోంది. దీంతో సినిమాను కొన్న బయ్యర్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో వెంకీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 8న విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమాను మే 20న విడుదల చేయలని అనుకుంటున్నారు. ఏప్రిల్ లో నయనతార సెట్స్ పైకి వస్తే… మే 20కి మూవీ థియేటర్లలోకి వస్తుంది.
Tags:    
Advertisement

Similar News