పవన్-చిరు కీలక ప్రకటన ఏమైనా ఉంటుందా....

మొన్నటివరకు రూమర్… కానీ తాజాగా అది యదార్థ రూపం దాల్చింది. అవును…. పవన్ కల్యాణ్ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడు. ఇది పక్కా అయింది. చిరు చేతుల మీదుగానే సర్దార్ ఆడియో రిలీజ్ అవుతుంది. చాలా…చాలా… ఏళ్ల తర్వాత చిరు-పవన్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తున్నారు. అది కూడా పవన్ సినిమా ఆడియో ఫంక్షన్ కావడం నిజంగా విశేషం. ఈ నేపథ్యంలో…. రాజకీయంగా […]

Advertisement
Update:2016-03-19 01:53 IST

మొన్నటివరకు రూమర్… కానీ తాజాగా అది యదార్థ రూపం దాల్చింది. అవును…. పవన్ కల్యాణ్ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడు. ఇది పక్కా అయింది. చిరు చేతుల మీదుగానే సర్దార్ ఆడియో రిలీజ్ అవుతుంది. చాలా…చాలా… ఏళ్ల తర్వాత చిరు-పవన్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తున్నారు. అది కూడా పవన్ సినిమా ఆడియో ఫంక్షన్ కావడం నిజంగా విశేషం. ఈ నేపథ్యంలో…. రాజకీయంగా వీళ్లిద్దరూ కలిసి ఓ సంయుక్త ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చిరంజీవి…. త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు కలిగిన పవన్ కల్యాణ్…. ఈమేరకు అన్నయ్య కోసం ఫ్లాట్ ఫాం సిద్ధంచేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు…. పవన్-చిరు కలిసి జనసేన పార్టీని కొత్త ఎత్తుకు తీసుకెళ్తారనే ప్రచారం కూడా ఉంది. కాపు పెద్దలంతా కలిసి మెగాబ్రదర్స్ మధ్య సయోధ్య కుదిర్చారని సమాచారం. సో… ఈ టైంలో పవన్-చిరు కలిసి పొలిటికల్ గా ఏదైనా ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News