బీఫ‌ని అరెస్టు చేశారు...కాద‌ని బెయిలిచ్చారు!

బీఫ్ వండుకుని తిన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట‌యిన రాజ‌స్థాన్ మేవాడ్‌ యూనివర్సిటీ విద్యార్థుల‌కు బెయిల్ ల‌భించింది. డిగ్రీచ‌దువుతున్న న‌లుగురు క‌శ్మీరీ విద్యార్థులను, యూనివ‌ర్శిటీలోని తమ హాస్ట‌ల్ గ‌దిలో ఆవుమాంసం వండుకుని తిన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు అరెస్టు చేశారు. మేవాడ్ యూనివ‌ర్శిటీని నూరుశాతం శాకాహార యూనివ‌ర్శిటీగా చెబుతారు. అయితే విద్యార్థులు వండుకుని తిన్న‌ది బీఫ్ కాదని నిపుణులు నిర్ధారించ‌డంతో చిత్తర్‌గఢ్‌లోని సబ్ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. 21 నుండి 27ఏళ్ల వ‌య‌సున్న న‌లుగురు క‌శ్మీరీ […]

Advertisement
Update:2016-03-17 07:34 IST

బీఫ్ వండుకుని తిన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట‌యిన రాజ‌స్థాన్ మేవాడ్‌ యూనివర్సిటీ విద్యార్థుల‌కు బెయిల్ ల‌భించింది. డిగ్రీచ‌దువుతున్న న‌లుగురు క‌శ్మీరీ విద్యార్థులను, యూనివ‌ర్శిటీలోని తమ హాస్ట‌ల్ గ‌దిలో ఆవుమాంసం వండుకుని తిన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు అరెస్టు చేశారు. మేవాడ్ యూనివ‌ర్శిటీని నూరుశాతం శాకాహార యూనివ‌ర్శిటీగా చెబుతారు. అయితే విద్యార్థులు వండుకుని తిన్న‌ది బీఫ్ కాదని నిపుణులు నిర్ధారించ‌డంతో చిత్తర్‌గఢ్‌లోని సబ్ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. 21 నుండి 27ఏళ్ల వ‌య‌సున్న న‌లుగురు క‌శ్మీరీ విద్యార్థులు షకీబ్ అష్రఫ్‌, హిలాల్ ఫరుఖ్, మహమ్మద్ మక్బూల్, షౌకత్ అలీలు బీఫ్ వండుకుని తిన్నార‌నే వ‌దంతులు క్యాంప‌స్‌లో ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. కొంద‌రు విద్యార్థులు, స్థానికులు క‌లిసి వారిని కొట్ట‌టంతో పాటు ఆందోళ‌నకు దిగారు. దాంతో పోలీసుల వారిని అరెస్టు చేశారు. అయితే వారు 300గ్రాముల మాంసాన్ని కొని తెచ్చుకుని వండుకున్నార‌ని, అది బీఫ్ కాద‌ని తేల‌డంతో వారికి బెయిల్ మంజూర‌యింది.

Tags:    
Advertisement

Similar News