మాజీ ప్రియురాలికి హృతిక్ నోటీసులు..!
ప్రేమలో వున్నప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా అసలు కనిపించదు. అదే బ్రేకప్ అయిన తరువాత .. చిన్న తప్పు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఒకప్పుడు కండల వీరుడు హృతిక్ రోషన్.. కంగనా రనౌత్ ఇద్దరు ప్రేమ పక్షులనే విషయం తెలి సిందే. అయితే బ్రేకప్ తరువాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. హృతిక్ కు పెళ్లి అయ్యింది. డైవోర్స్ అయ్యింది. కట్ చేస్తే..ఈ మధ్య ఆషికి 3 చిత్రంలో హీరోయిన్ గా కంగనను ముందు […]
ప్రేమలో వున్నప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా అసలు కనిపించదు. అదే బ్రేకప్ అయిన తరువాత .. చిన్న తప్పు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఒకప్పుడు కండల వీరుడు హృతిక్ రోషన్.. కంగనా రనౌత్ ఇద్దరు ప్రేమ పక్షులనే విషయం తెలి సిందే. అయితే బ్రేకప్ తరువాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. హృతిక్ కు పెళ్లి అయ్యింది. డైవోర్స్ అయ్యింది. కట్ చేస్తే..ఈ మధ్య ఆషికి 3 చిత్రంలో హీరోయిన్ గా కంగనను ముందు అనుకున్నారు. కానీ .. ఎవో కారాణాలు చెప్పి.. తప్పించారు. తనను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పంచడం వెనక హృతిక్ హ్యాండ్ వుంది అనేది కంగన ఫీలింగ్. అదే విషయాన్ని ఒక సారి ప్రెస్ మీట్ లో ఇండైరెక్ట్ గా చెప్పింది. మాజీ ప్రేమికులు ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేస్తారో తెలియదంటూ సెటైర్ వేసింది.
దీంతో హృతిక్ కు ఎక్కడో తగిలింది. అందుకే తన పరవు తీస్తుందంటూ .. లాయర్ తో కంగనకు నోటిసులు పంపిచాడట. అయితే కంగన కూడా స్పీడ్ గానే రియాక్ట్ అయ్యింది. తను కూడా తన లాయర్స్ ద్వారా.. రివర్స్ గేర్ లో నోటీసులు పంపించిందట. తను ఎప్పుడు డైరెక్ట్ గా హృతిక్ రోషన్ పేరు మీడియాలో ప్రస్తావించలేదు అనేది కంగనా వాదన. ఏది ఏమైనా ఒక్కసారి ప్రేమికుల మధ్య గ్యాప్ వస్తే ఇలాగే వుంటుంది అంటున్నారు క్రిటిక్స్.