పాపం సమంత... బాధను అలా దిగమింగుతుంది

కొన్ని మాన‌సిక‌మైన బాధ‌ల‌కు ఎవ‌రు మిన‌హాయింపు కాదు. ఇక ఇదే విషయం సినిమా హీరోయిన్స్ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ముఖ్యంగా చేతినిండా సినిమాలున్న హీరోయిన్స్ కు ఖాళీ స‌మ‌యమే దొర‌క‌దు. డేట్స్ అన్ని బ్లాక్ అయి వుంటాయి. ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో గ‌డిపే స‌మ‌యమే చిక్క‌దు. దీంతో ఒక వైపు కెరీర్ ప‌రంగా బిజీగా వున్నామ‌నే సంతోషం తో వున్న‌ప్ప‌టికి… ఫ్యామిలీని మిస్ అవుతున్నామ‌నే చిన్న మాన‌సిక వేద‌న‌తో కూడిన పెయిన్ వుంటుంది. ఇదే విషయంపై […]

Advertisement
Update:2016-03-14 10:54 IST

కొన్ని మాన‌సిక‌మైన బాధ‌ల‌కు ఎవ‌రు మిన‌హాయింపు కాదు. ఇక ఇదే విషయం సినిమా హీరోయిన్స్ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ముఖ్యంగా చేతినిండా సినిమాలున్న హీరోయిన్స్ కు ఖాళీ స‌మ‌యమే దొర‌క‌దు. డేట్స్ అన్ని బ్లాక్ అయి వుంటాయి. ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో గ‌డిపే స‌మ‌యమే చిక్క‌దు. దీంతో ఒక వైపు కెరీర్ ప‌రంగా బిజీగా వున్నామ‌నే సంతోషం తో వున్న‌ప్ప‌టికి… ఫ్యామిలీని మిస్ అవుతున్నామ‌నే చిన్న మాన‌సిక వేద‌న‌తో కూడిన పెయిన్ వుంటుంది. ఇదే విషయంపై స‌మంత మాట్లాడుతూ.. తన చేతిలో ప్రస్తుతం 6 చిత్రాలున్నాయని, ఫుల్ బిజీగా ఉండడంతో క‌నీసం ఒక వారం రోజుల పాటు కూడా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ను క‌లసి గడిపే అవ‌కాశం రావడంలేదని బాధపడుతోంది. అయితే త‌నకు త‌ర‌చు కుటుంబ స‌భ్యులు గుర్తుస్తుంటార‌ట‌. అందుకే వాళ్లు గుర్తొచ్చిన‌ప్పుడల్లా గులాబ్ జాము తింటు త‌న బాధ‌ను ఓవ‌ర్ టేక్ చేస్తుంద‌ట ఈ క్యూట్ బ్యూటీ.

మ‌రి గులాబ్ జాము తింటే త‌న బాధ ఇట్టే మాయ‌మ‌వుతుందటున్న సమంతాని ఇది ఎలా అని అడిగితే త‌న వ‌ద్ద స‌మాధానం మాత్రం లేదంటోంది. మొత్తం మీద గులాబ్ జాము త‌న ఫ్యామిలిని మర్చిపోయోలా చేస్తుంద‌న్న‌మాట‌.! ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విజయ్‌కు జంటగా తేరి, సూర్య సరసన నటించిన 24 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో కూడా రెండు , మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ మ‌ల‌యాళ కుట్టి.

Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News