ర‌జ‌నీకాంత్ వార్నింగ్ ప‌ని చేసింది..!

ఎంత‌టి వారికైన అనుభ‌వం అనేది చాల విలువైన పాఠం. చేసిన పోర‌పాటును మ‌ళ్లీ చేయకుండా వుండ‌ట‌మే విజ్ఞ‌త. ర‌జ‌నీకాంత్ అంటే నిర్మాత‌ల పాలిట బాక్సాఫీస్ బొనాంజ‌. చాల పెద్ద మార్కెట్ .. ద‌క్షిణాది అంత‌ట ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న స్టార్ హీరో కావడంతో సాధార‌ణంగా ర‌జ‌నీకాంత్ సినిమా అంటే బేరం ఎక్కువుగా చేస్తుంటారు. అయితే కొచ్చాడియ‌న్.. లింగ చిత్రాలు భారీ బ‌డ్జెట్ సినిమాలు.. విప‌రీత‌మైన హైప్ తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ముఖ్యంగా లింగ […]

Advertisement
Update:2016-03-14 11:59 IST

ఎంత‌టి వారికైన అనుభ‌వం అనేది చాల విలువైన పాఠం. చేసిన పోర‌పాటును మ‌ళ్లీ చేయకుండా వుండ‌ట‌మే విజ్ఞ‌త. ర‌జ‌నీకాంత్ అంటే నిర్మాత‌ల పాలిట బాక్సాఫీస్ బొనాంజ‌. చాల పెద్ద మార్కెట్ .. ద‌క్షిణాది అంత‌ట ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న స్టార్ హీరో కావడంతో సాధార‌ణంగా ర‌జ‌నీకాంత్ సినిమా అంటే బేరం ఎక్కువుగా చేస్తుంటారు. అయితే కొచ్చాడియ‌న్.. లింగ చిత్రాలు భారీ బ‌డ్జెట్ సినిమాలు.. విప‌రీత‌మైన హైప్ తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ముఖ్యంగా లింగ చిత్రం రిలీజ్ అయిన తరువాత నిర్మాత‌లు.. బ‌య్య‌ర్లు బాగా గోల చేశారు. ఎక్కువ రేటు పెట్టి నిర్మాత ద‌గ్గ‌ర లింగ చిత్రం రైట్స్ కొంటే .. రీట‌ర్న్ లో యాభైశాతం కూడ రాలేదు అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో క‌బాలి సినిమా బ‌డ్జెట్ విష‌యం నుంచి ప్రాజెక్ట్ అమ్మే వ‌ర‌కు ర‌జ‌నీకాంత్ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.

ర‌జ‌నీకాంత్ చిత్ర‌మంటే వంద కోట్లు పెట్ట‌డం నిర్మాత‌కు పెద్ద విష‌యం కాదు. అయితే కబాలి విష‌యంలో మాత్రం 70 కోట్ల కు మించ కుండ సినిమా బ‌డ్జెట్ ను ముందుగానే కంట్రోల్ చేసార‌ట‌. దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగా ఇప్పుడు రెట్టింపు లాభాలు చూసిందని కోలీవుడ్ టాక్. కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు అయినట్లు సమాచారం. దాంతో నిర్మాత పూర్తి ఆనందంగా ఉన్నారు. మొత్తం గ‌త రెండు చిత్రాల న‌ష్టాలు నేర్పిన అనుభ‌వంతో ఈ సారి సూప‌ర్ స్టార్ అలెర్ట్ కావ‌డం ..ప్రొడ్యూస‌ర్స్ కు.. బ‌య్య‌ర్ల‌కు సేఫ్ గేమ్ అనే చెప్పాలి. ఎంతైనా స్టార్ ఈజ్ మ‌రి. ఇక క‌బాలి చిత్రం లో ర‌జ‌నీకాంత్ ఒక మాఫియ డాన్ గా క‌నిపిస్తున్నారు . రాధిక ఆప్టే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News