ఇది శాపమా? యాదృచ్చికమా?

వైసీపీ ప్రస్తానంలో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా దూషణలకు గురైన నాయకుడెవరైనా ఉన్నారంటే అది జగనే. పదవుల కోసమో, అధినాయకత్వం మొప్పుకోసమో గానీ జగన్‌ను తిట్టని ప్రత్యర్థి పార్టీ నేతలు లేరు. అయితే అదేంటో గానీ జగన్‌ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన నేతలంతా తాత్కాలికంగా పదవుల పరంగా లబ్ధి పొందినా అనంతరం అడ్రస్ లేకుండా పోయారు. మాజీ మంత్రి శంకర్రావు. జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసి కాంగ్రెస్ వ్యూహంలో పావుగా మారిన […]

Advertisement
Update:2016-03-12 04:56 IST

వైసీపీ ప్రస్తానంలో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా దూషణలకు గురైన నాయకుడెవరైనా ఉన్నారంటే అది జగనే. పదవుల కోసమో, అధినాయకత్వం మొప్పుకోసమో గానీ జగన్‌ను తిట్టని ప్రత్యర్థి పార్టీ నేతలు లేరు. అయితే అదేంటో గానీ జగన్‌ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన నేతలంతా తాత్కాలికంగా పదవుల పరంగా లబ్ధి పొందినా అనంతరం అడ్రస్ లేకుండా పోయారు. మాజీ మంత్రి శంకర్రావు.

జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసి కాంగ్రెస్ వ్యూహంలో పావుగా మారిన నేత. జగన్ కేసు నడిచినంత కాలం శంకర్రావును కాంగ్రెస్, టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా ఓ రేంజ్‌లో పైకి లేపారు. కానీ అలాంటి వ్యక్తి కూడా చివరకు తీవ్ర ఇబ్బందుల్లోపడ్డారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో మంత్రి పదవి పొగొట్టుకోవడమే కాకుండా అరెస్ట్‌ను ఎదుర్కొన్నారు. ఇంట్లో ఉన్న శంకర్రావు బట్టలు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడం చూశాం. తరువాత ఆయన రాజకీయంగా జీరో అయిపోయారు. శంకర్రావుతో పాటు జగన్‌ కేసుల విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఎర్రన్నాయుడు. కానీ ఆయన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

ఇక మంత్రి పదవి కోసం జగన్‌పై ఒంటికాలితో లేచిన వ్యక్తి డీఎల్ రవీంద్రారెడ్డి. జగన్‌ను గట్టిగా తిట్టడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం మొప్పుపొంది మంత్రి పదవి పొందారు. కానీ అనంతరం అవమానకరంగా కిరణ్‌ కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయ్యారు. డీఎల్ కూడా రాజకీయంగా ఇప్పుడు ఎడారిలో నిలబడ్డారు.

జగన్‌,వైఎస్‌ను తీవ్రంగా దూషించిన వారిలో రేవంత్ కూడా ఉన్నారు. వైఎస్ చనిపోతే కనీస విలువలు పాటించకుండా పావురాల గుట్టలో పావురమైపోయాడంటూ కొత్త డైలాగులను పదేపదే పలికేవారు. జగన్‌కు జైల్లో చిప్పకూడు తిన్నాక కూడా బుద్ధిరాలేదంటూ నీతి వ్యాఖ్యలు చేసేవారు. చివరకు చిప్పకూడు డైలాగ్ చెప్పిన రేవంత్ కూడా ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తినే వచ్చారు.

ఒకప్పుడు టీడీపీలో ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామరావు కూడా జగన్ కేసు విచారణ సమయంలో సీబీఐ జేడీ లక్మినారాయణకు సలహాలు ఇచ్చే వారని వార్తలు అప్పట్లో వచ్చాయి. అది ఎంతవరకు నిజమో గానీ… ఇప్పుడు విజయరామరావు కుమారుడు కూడా సీబీఐ కేసులో ఇరుకున్నారు.

జగన్‌ను కేసుల్లో పెట్టి ఇరికించడంలో అప్పటి కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ముఖ్యమైనది. సీబీఐని ఉసిగొల్పి కక్ష సాధింపుకు దిగారు. ఇప్పుడు అదే చిదంబరం తన కుమారుడిని సీబీఐ వెంటాడుతుంటే కాలి కాలిన పిల్లిలా చిందులు తొక్కుతున్నారు. వీళ్లే కాదు ఇలా చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా వైఎస ఫ్యామిలీని తిట్టి రాజకీయంగా బాగా దెబ్బతిన్నారు. వీళ్ళందరికి రింగ్ మాస్టర్ గా వ్యవహరించిన సోనీయాగాంధీ పరిస్థితి మరీ దారుణం. ఏపిలో కాంగ్రెస్ పుట్టగతులు లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. కేంద్రంలోనేమో కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా సంపాదించుకోలేకపోయింది సోనియా సారధ్యంలో.

ఇది శాపమో లేక యాదృచ్చికమో!

– రామనాథ్‌ రెడ్డి నార్పల

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News