క్షణం డైరెక్టర్ చంపేశాడు..!
డెబ్యూ డైరెక్టర్ సినిమా అంటే పెద్దగా అంచనాలుండవు. సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన టాక్ ను బట్టే అతని గురించి ఆలోచన ప్రారంభం అవుతుంది. క్షణం చిత్రంతో రవికాంత్ పేరపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అడవి శేషు కథ అందించి నటించిన ఈ చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ హృదయాల్ని గెలుచుకుంది. ఇలాంటి ఒక సినిమాను తీయాలన్న ఆలోచనతో పాటు, అందుకు సరైన స్క్రీన్‌ప్లేను […]
డెబ్యూ డైరెక్టర్ సినిమా అంటే పెద్దగా అంచనాలుండవు. సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన టాక్ ను బట్టే అతని గురించి ఆలోచన ప్రారంభం అవుతుంది. క్షణం చిత్రంతో రవికాంత్ పేరపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అడవి శేషు కథ అందించి నటించిన ఈ చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ హృదయాల్ని గెలుచుకుంది. ఇలాంటి ఒక సినిమాను తీయాలన్న ఆలోచనతో పాటు, అందుకు సరైన స్క్రీన్‌ప్లేను రాసుకోవడం, సన్నివేశాలను కూర్చడం, సస్పెన్స్‌ను చివరివరకూ కొనసాగించడం వంటి విషయాల్లో రవికాంత్ ప్రతిభ మెచ్చుకోతగినది. రవికాంత్ మేకింగ్ పరంగా చాలాచోట్ల ప్రయోగాలు చేశాడు. సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. ఈ చిత్రంలో అడవి శేషు , ఆదాశర్మ, యాంకర్ అనసూయ లీడ్ రోల్స్ చేశారు. పీవిపి బ్యానర్ లో చిత్రాన్ని రిలీజ్ చేశారు. మొత్తం మీద రవికాంత్ దర్శకుడిగా మొదటి చిత్రంతోనే స్క్రీన్ ప్లే పరంగా డిస్టెంక్షన్ కొట్టాడు అనేది విమర్శకుల మాట. ఇది నిజంగా అతని కెరీర్ కు బంగారు బాట వేసే బోణి అని చెప్పాలి మరి.