అంజలి ఆ పాత్ర చేస్తోందా?
మిగిలిన హీరోయిన్ల కంటే తాను భిన్నంగా వెళుతున్నానని అంజలి నమ్మకం. సాధ్యమైనంత వరకు హీరోయిన్ పాత్రకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపిస్తోంది తను. ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న చిత్రాంగదలోనూ అంజలి వెరైటీ క్యారక్టర్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ప్రధాన పాత్ర సెక్స్‌మార్పిడి చేయించుకున్న వ్యక్తి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని తీస్తున్నారు. ఈ పాత్రకోసం అంజలి కొన్ని కిలోల బరువు కూడా తగ్గిందట. అంతేకాదు, ఒక […]
మిగిలిన హీరోయిన్ల కంటే తాను భిన్నంగా వెళుతున్నానని అంజలి నమ్మకం. సాధ్యమైనంత వరకు హీరోయిన్ పాత్రకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపిస్తోంది తను. ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న చిత్రాంగదలోనూ అంజలి వెరైటీ క్యారక్టర్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ప్రధాన పాత్ర సెక్స్‌మార్పిడి చేయించుకున్న వ్యక్తి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని తీస్తున్నారు.
ఈ పాత్రకోసం అంజలి కొన్ని కిలోల బరువు కూడా తగ్గిందట. అంతేకాదు, ఒక డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నదట. ఈ సినిమాకోసం ఒక పాటకూడా పాడుతోంది. పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే దీని టీజర్‌ని విడుదల చేశారు. సమ్మర్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.