అవును రెమ్యున‌రేష‌న్ పెంచా

సినిమా, సినిమాకు పారితోషకం పెంచ‌డం కామ‌నే, ఎవ‌రైనా అలాగే పెంచుతారు అంటున్నాడు నానీ. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన నానీ ప్రస్తుతం కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌తో ఈ శుక్ర‌వారం నుండి  ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడు.  రెమ్యున‌రేష‌న్ గురించి నానీ నిర్మొహమాటంగా మాట్లాడాడు. సినిమా సినిమాకు ఎవ‌రైనా పెంచుతారు, అది స‌హ‌జ‌మే అన్నాడు. తాను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా చేసిన మొద‌టి చిత్రానికి 2,500 తీసుకుంటే రెండ‌వ చిత్రానికి 3,500 రూ. తీసుకున్నాన‌న్నాడు. అయితే […]

Advertisement
Update:2016-02-10 04:36 IST

సినిమా, సినిమాకు పారితోషకం పెంచ‌డం కామ‌నే, ఎవ‌రైనా అలాగే పెంచుతారు అంటున్నాడు నానీ. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన నానీ ప్రస్తుతం కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌తో ఈ శుక్ర‌వారం నుండి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడు. రెమ్యున‌రేష‌న్ గురించి నానీ నిర్మొహమాటంగా మాట్లాడాడు. సినిమా సినిమాకు ఎవ‌రైనా పెంచుతారు, అది స‌హ‌జ‌మే అన్నాడు. తాను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా చేసిన మొద‌టి చిత్రానికి 2,500 తీసుకుంటే రెండ‌వ చిత్రానికి 3,500 రూ. తీసుకున్నాన‌న్నాడు.

అయితే అప్పుడు తేడా వేల‌ల్లో ఉంటే ఇప్పుడు కోట్ల‌లో ఉంది. అంత‌కుముందు ఒక కోటి తీసుకున్న నానీ, భ‌లేభ‌లే మ‌గాడివోయ్ హిట్ త‌రువాత రెండుంపావు కోట్ల‌కు త‌న పారితోష‌కం పెంచాడ‌ని స‌మాచారం. అయితే నానీ రెమ్యున‌రేష‌న్ పెంచినా నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌ద‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. అత‌ను తీసుకుంటున్న 2.25 కోట్ల‌కు అద‌నంగా మ‌రొక 2.25 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెడితే సినిమా పూర్తయి పోతుంది. అప్పుడు 4.5 కోట్లు బాక్సాఫీస్ వ‌ద్ద రాబ‌ట్టినా నిర్మాత న‌ష్ట‌పోకుండా ఉంటాడు.

నానీ సినిమాకు ఆ మాత్రం వ‌సూలు చేయ‌డం క‌ష్టం కాదు క‌నుక‌, ఇత‌ర చిన్న హీరోల సినిమాల‌కు ఎనిమిది, తొమ్మిది కోట్లు పెట్టే కంటే నానీ మీద ఆ మాత్రం పెట్ట‌వ‌చ్చ‌ని ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న మాట‌. పైగా నానీ సినిమాలు ఎ సెంట‌ర్ల‌లో బాగా ఆడతాయి. ఇక సినిమాలో కామెడీ పండిందంటే నిర్మాత పెట్టిన డ‌బ్బుకి ఢోకా ఉండ‌దట‌.

Tags:    
Advertisement

Similar News