బెల్లం `కొండ` కు ఏం మిగిలింది..?
హీరో కావడానికి ఫిజికల్ గా అన్ని క్వాలిఫి కేషన్స్ ఉన్న అబ్బాయి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ . తండ్రి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత కావడంతో.. ఈ కుర్రాడికి మంచి బ్యాగ్రౌండ్ ఏర్పడింది. అల్లుడు శీను పేరు తో ఒక భారీ చిత్రంతో కొడుకును హీరోగా లాంచ్ చేశాడు. తండ్రిగా కొడుకు కెరీర్ కోసం భారీగానే చేశారు. అయితే ఎంత చేసినా కొత్త హీరోలకు అభిమాన దళాలు ఏర్పడటం కష్టం. సినిమా కథ బావుంటే […]
హీరో కావడానికి ఫిజికల్ గా అన్ని క్వాలిఫి కేషన్స్ ఉన్న అబ్బాయి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ . తండ్రి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత కావడంతో.. ఈ కుర్రాడికి మంచి బ్యాగ్రౌండ్ ఏర్పడింది. అల్లుడు శీను పేరు తో ఒక భారీ చిత్రంతో కొడుకును హీరోగా లాంచ్ చేశాడు. తండ్రిగా కొడుకు కెరీర్ కోసం భారీగానే చేశారు. అయితే ఎంత చేసినా కొత్త హీరోలకు అభిమాన దళాలు ఏర్పడటం కష్టం. సినిమా కథ బావుంటే కొంత వరకు చూస్తారు. బాగా లేక పోతే ఎన్ని కోట్లు పెట్టి సినిమా చేసినా అది బుడిదలో పోసిన పన్నీరు బాపత్తే. అల్లుడు శీను కోసం భారీగానే ఖర్చు చేసి చేతులు కాల్చుకున్నారు. సరే అది సాయి శ్రీనివాస్ కు గ్రాండ్ లాంచ్ ప్యాడ్ గా హెల్ప్ అయ్యింది.
ఇక తన రెండో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్..సీనియర్ డైరెక్టర్ భీమినేని తో జత కట్టారు. తమిళంలో ఘన విజయం సాధించిన సుందర్ పాండ్యన్ అనే సినిమాను రీమేక్ చేసి స్పీడున్నోడు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తమిళ్ లో సహజ సిద్ద కథ, కథనాలతో రక్తి కట్టించింది. తెలుగు రీమేక్ కు వచ్చే సరికి.. పూర్తి వాణిజ్య విలువలతో హీరో క్యారెక్టరైజేషన్ లో సూపర్ హీరో తరహా క్యారెక్టరైజేషన్ చేశారు. దీంతో సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది. హీరో వరకు మార్కులు పడినప్పటికి.. అతని కెరీర్ కు అంత గా ఉపయోగ పడే ప్రాజెక్ట్ కాదనేది క్రిటిక్స్ టాక్ మరి.