కాపుల సత్తా- ఏ రంగంలో ఎంత మంది?
రిజర్వేషన్ల కోసం కాపులు ఉద్యమించారు. ఈనెల 5 నుంచి ముద్రగడ పద్మనాభం అమరణ దీక్షకు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో కాపులు ఎంత వరకు సామాజికంగా వెనుకబడ్డారన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై ఒక జాతీయ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. కాపులు మరీ అంతగా వెనకబడి లేరన్నట్టుగా ఆ కథనంలోని వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో కాపులదే పైచేయిగా ఉంది. కమ్మ సామాజికవర్గం తర్వాత సినీ రంగంలో ఎక్కువమంది నటులు, డైరెక్టర్లు ఉన్నది కాపు […]
రిజర్వేషన్ల కోసం కాపులు ఉద్యమించారు. ఈనెల 5 నుంచి ముద్రగడ పద్మనాభం అమరణ దీక్షకు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో కాపులు ఎంత వరకు సామాజికంగా వెనుకబడ్డారన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై ఒక జాతీయ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. కాపులు మరీ అంతగా వెనకబడి లేరన్నట్టుగా ఆ కథనంలోని వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో కాపులదే పైచేయిగా ఉంది. కమ్మ సామాజికవర్గం తర్వాత సినీ రంగంలో ఎక్కువమంది నటులు, డైరెక్టర్లు ఉన్నది కాపు సామాజికవర్గం నుంచే.
మొత్తం 55 మంది నటులు కాపు సామాజికవర్గంవారేనని కథనం చెబుతోంది. చిరు, పవన్, అల్లు అర్జున్‌తో పాటు వారి కుటుంబం నుంచి ఉన్నవారంతా కాపులే. సత్యనారాయణ, ఎస్వీ రంగారావు, పూరి జగన్నాథ్, వివి వినాయక్, కోడి రామకృష్ణ వంటి గొప్పవారంతా కాపులే. రాజకీయంగానే కాపులు చాలా మందే ఉన్నారని పత్రిక కథనం చెబుతోంది. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ప్రస్తుత మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస్, నారాయణ కాపు వర్గానికి చెందిన వారే. వైసీపీ నేత జ్యోతుల నెహ్రు కూడా కాపు వర్గానికి చెందిన వ్యక్తేనని కథనం గుర్తు చేస్తోంది.
బీసీ నేతలు కూడా కాపులు సామాజికంగా వెనుకబడి లేరని వాదిస్తున్నారు. బీసీ నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం న్యాయమూర్తులు( జస్టిస్ స్థాయి) ఎనిమిది మంది ఉన్నారు. ఐఏఎస్‌లు 27 మంది, ఐపీఎస్‌లు 25 మంది, ఐఎఫ్‌ఎస్‌లు ఏడుగురు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో 32 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారని బీసీ నేతలు చెబుతున్నారు.
Click on Image to Read: