ఈ మాత్రానికి కేరళ నుంచి రావాలా...తమ్ముడూ!
తుని విధ్వంసంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలుసుకుని కేరళ నుంచి వచ్చానన్నారు. తుని ఘటనపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన పవన్… కాపు రిజర్వేషన్లపై పార్టీ వైఖరి మాత్రం సూటిగా చెప్పలేదు.. తాను ఒక కులం కోసం పోరాటం చేసే వ్యక్తిని కాదంటూ తప్పించుకున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నేతలు, ఉద్యమకారులకు మాత్రం సూచనలు చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం ఒక్క రోజులో వచ్చింది కాదన్నారు. […]
తుని విధ్వంసంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలుసుకుని కేరళ నుంచి వచ్చానన్నారు. తుని ఘటనపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన పవన్… కాపు రిజర్వేషన్లపై పార్టీ వైఖరి మాత్రం సూటిగా చెప్పలేదు.. తాను ఒక కులం కోసం పోరాటం చేసే వ్యక్తిని కాదంటూ తప్పించుకున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నేతలు, ఉద్యమకారులకు మాత్రం సూచనలు చేశారు.
కాపు రిజర్వేషన్ల అంశం ఒక్క రోజులో వచ్చింది కాదన్నారు. ఇది ఒక్క టీడీపీ సమస్య మాత్రమే కాదన్నారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్లపై మీ వైఖరేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పవన్ నేరుగా స్పందించలేదు. తాను ఒక కులం కోసం పోరాడే వ్యక్తిని కాదన్నారు.
ట్రైన్ తగలబెట్టడం వెనుక అసాంఘిక శక్తులు హస్తముందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వారు మాత్రం ఇలా చేయరంటూ పరోక్షంగా ఇతర ప్రాంతాల వారిపైకి నేరం నెట్టే ప్రయత్నం చేశారు పవన్. ఉద్యమాన్ని నడిపే నాయకులు బాధ్యత యుతంగా వ్యవహరించాలన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని పరోక్షంగా ముద్రగడను తప్పుపట్టారు. అలా చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు రోకో, రాస్తారోకోలపై ముందే సమాచారం ఇచ్చేవారని .. ఇక్కడ అలా జరగలేదన్నారు.
చంద్రబాబు కష్టాల్లో ఉన్న ప్రతిసారి మీరు దిగుతారన్న అభిప్రాయం ఉందన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు పవన్ అసహనం వ్యక్తం చేశారు. ”మీ మనసులో మాటలు చెబితే” ఎలా అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును కూడా పవన్ తప్పుపట్టారు. ఇన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు ప్రభుత్వం, పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
సహాయ నిరాకరణ సమయంలో జరిగిన హింస వల్లే స్వాతంత్ర్యం మరో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు పవన్. హక్కుల సాధనకు ఒక ఎజెండా, పద్దతి ఉండాలని… అది పక్కదారి పట్టకూడదని సూచించారు. భావోధ్వేగాలను రెచ్చగొట్టకూడదన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు పవన్.
Click on Image to Read: