హంతకుడిని స్పీకర్‌ని చేశావ్... క్రిమినల్ నువ్వా నేనా?

కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం వెనుక వైసీపీ హస్తం ఉందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే క్రిమినల్ మనస్థత్వం చంద్రబాబుదే అని మండిపడ్డారు. వర్గీకరణ పేరుతో ఎస్పీల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టిన             చిచ్చే ఇప్పటికీ మాల, మాదిగల మధ్య రగులుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. […]

Advertisement
Update:2016-02-01 09:52 IST

కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం వెనుక వైసీపీ హస్తం ఉందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే క్రిమినల్ మనస్థత్వం చంద్రబాబుదే అని మండిపడ్డారు. వర్గీకరణ పేరుతో ఎస్పీల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టిన చిచ్చే ఇప్పటికీ మాల, మాదిగల మధ్య రగులుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. కాపు గర్జనకు వైసీపీ నేతలు వెళ్లడాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు… అదే సభకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారని మరి బీజేపీని చంద్రబాబు ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలను తిడితే చెంపపగులుతుందని భయమా అని జగన్ నిలదీశారు.

కాపునాయకుడు వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ”రంగాను చంపిన వారిలో ఒకరైన కోడెల శివప్రసాదరావును స్పీకర్‌ను చేశావ్. దేవినేని ఉమను మంత్రిని చేశావ్. మరొకాయన రామకృష్ణ విజయవాడ నుంచి విశాఖ వెళ్లి అక్కడ ఎమ్మెల్యేను చేశావ్!. అసలు క్రిమినల్ నువ్వా నేనా” అని జగన్ ప్రశ్నించారు. టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు సభకు వెళ్లకుండా అడ్డుకోలేదా అని ప్రశ్నించారు.

వర్గీకరణ పేరుతో ఎస్సీల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు… ఇప్పుడు బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నావని ప్రశ్నించారు.” బలవంతపు భూసేకరణ వద్దంటే వైసీపీ రాజధానికి వ్యతిరేకమంటావ్… పోలవరం కట్టమంటే జగన్ సీమకు వ్యతిరేకమంటావ్. కాల్‌ మనీ నిందితులను శిక్షించమంటే జగన్ విజయవాడకు వ్యతిరేకమంటావ్ ఇదేనా రాజకీయం” అని జగన్ ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News