ఇప్పుడేమంటారు?

ఆంధ్రప్రదేశ్‌ జరుగుతున్న పలు ఘటనల సమయంలో ఇంటెలిజెన్స్ పనితీరు పదేపదే చర్చనీయాంశమవుతోంది. పెద్దపెద్ద ప్రమాదాలను కూడా ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడం మిగిలిన పోలీస్ విభాగాలకు సైతం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనురాధ ఉండేవారు. అయితే ఓటుకు నోటు సమయంలో ఆమెపై ప్రభుత్వం వేటు వేసింది. ఓటుకు నోటు డీల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌ తెలంగాణ పోలీసులు ట్యాప్ చేస్తుంటే పసిగట్టలేకపోయారంటూ ఆమెపై ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. ఆమె స్థానంలో చంద్రబాబు […]

Advertisement
Update:2016-02-01 04:58 IST

ఆంధ్రప్రదేశ్‌ జరుగుతున్న పలు ఘటనల సమయంలో ఇంటెలిజెన్స్ పనితీరు పదేపదే చర్చనీయాంశమవుతోంది. పెద్దపెద్ద ప్రమాదాలను కూడా ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడం మిగిలిన పోలీస్ విభాగాలకు సైతం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనురాధ ఉండేవారు. అయితే ఓటుకు నోటు సమయంలో ఆమెపై ప్రభుత్వం వేటు వేసింది. ఓటుకు నోటు డీల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌ తెలంగాణ పోలీసులు ట్యాప్ చేస్తుంటే పసిగట్టలేకపోయారంటూ ఆమెపై ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు.

ఆమె స్థానంలో చంద్రబాబు ఏరికోరి అప్పటి వరకు విజయవాడ సీపీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును తీసుకొచ్చారు. అయితే వెంకటేశ్వరరావు వచ్చాక పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా వరుసగా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలోనే సంచలనం సృష్టించిన బెజవాడ కాల్‌ మనీ దందా విజృంభించినా దాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టలేకపోయింది. బెజవాడ కమిషనర్ చొరవ తీసుకునే వరకు కాల్ మనీ బుసలు కొట్టింది. చిత్తూరు మేయర్‌ను ఆమె కార్యాలయంలోనే పట్టపగలు కాల్చిచంపేశారు. తనకు ప్రాణహానీ ఉందని ఆమె కొద్ది రో్జుల క్రితమే పోలీసులను ఆశ్రయించారు. కానీ దాని తీవ్రతను లోకల్ ఇంటెలిజెన్స్ గుర్తించలేకపోయింది. అన్నింటికి మించి కాపు గర్జన, అనంతర పరిణామాల తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్‌పై ఒక్క శాతం కూడా నమ్మకం కుదరని పరిస్థితి.

కాపు గర్జనకు లక్షల మంది తరలివస్తారని తెలిసినా ఆ తర్వాత ఏం జరుతుందన్నది మాత్రం పసిగట్టలేకపోయింది ఇంటెలిజెన్స్. పైగా సభకు అనుమతి స్థలంపై చర్చ జరుగుతోంది. రైల్వే ట్రాక్‌ సమీపంలో సభకు అనుమతివ్వడం చర్చనీయాంశమవుతోంది. లక్షల మంది తరలివచ్చే సభకు, అందులోనూ రిజర్వేషన్ల సాధన వంటి సున్నితమైన అంశంపై జరుగుతున్న సభకు రైలు ట్రాక్ పక్కన, రహదారి సమీపంలో అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రశ్న. ఇలాంటి సభ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఉండాలి. కానీ అలాంటివేమీ జరగడం లేదు. పక్క రాష్ట్ర్రంలో ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ జరిగితే వెంటనే అనురాధపై వేటు వేసిన ప్రభుత్వం… ఇప్పుడు ఏపీలో వరుసగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది చర్చనీయాంశమైంది.

Click on Image to Read:

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News