కాపు గర్జనకు టీడీపీ నేతలు వెళ్తే ఏం జరుగుతుంది?
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈనెల 31న తుని వేదికగా జరగనున్న కాపు గర్జన సభ టీడీపీకి సంకటంగా మారింది. ఊహించని రీతిలో కాపులంతా సంఘటితం అవుతుండడంతో టీడీపీకి చెందిన కాపు నేతలు ఇరుకునపడ్డారు. సభకు వెళ్లాలని వారు భావిస్తున్నా చంద్రబాబు ఆదేశాలతో సంశయిస్తున్నారు. కాపులకు అన్నీ చేస్తున్నా కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని కాబట్టి అలాంటి సభకు వెళ్లవద్దని సీఎం శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అయితే […]
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈనెల 31న తుని వేదికగా జరగనున్న కాపు గర్జన సభ టీడీపీకి సంకటంగా మారింది. ఊహించని రీతిలో కాపులంతా సంఘటితం అవుతుండడంతో టీడీపీకి చెందిన కాపు నేతలు ఇరుకునపడ్డారు. సభకు వెళ్లాలని వారు భావిస్తున్నా చంద్రబాబు ఆదేశాలతో సంశయిస్తున్నారు. కాపులకు అన్నీ చేస్తున్నా కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని కాబట్టి అలాంటి సభకు వెళ్లవద్దని సీఎం శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అయితే కార్యకర్తలు కాపుసభకు వెళ్లి తీరుతామని తేల్చిచెబుతున్నారు. ఈ విషయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మాటలను కిందస్థాయి కాపు శ్రేణులు లెక్కచేయడం లేదు. సొంతసామాజికవర్గ సభకు వెళ్లవద్దని ఆదేశించడం ఏ తరహా రాజకీయమని ప్రశ్నిస్తున్నారు. దీంతో నేతలు కూడా ఎదురు సమాధానం చెప్పలేకపోతున్నారు.
సభకు టీడీపీ నేతలు దూరంగా ఉండాలన్న చంద్రబాబు ఆదేశాల వెనుక కొన్ని కారణాలున్నాయని చెబుతున్నారు. ఎన్ని చెప్పినా కాపు గర్జన సభ చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నదే. కాబట్టి సభలో చంద్రబాబు ప్రభుత్వంపై నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. ఒకవేళ సభకు టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరైనా చంద్రబాబుపై ఇతర నేతలు చేసే విమర్శలను అడ్డుకునే అవకాశం ఉండదు. మంత్రుల సమక్షంలోనే చంద్రబాబును ఇతర నేతలు తిడితే ఆ విషయం మరింత ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సభకు వెళ్తే టీడీపీకి చెందిన శ్రేణులు మరింత ఉత్సాహంగా భారీ సంఖ్యలో సభకు వెళ్తారు.
కాపు గర్జన సభ ఎంత విజయవంతమైతే… చంద్రబాబుపై కాపుల్లో అంత వ్యతిరేకత ఉన్నట్టుగా కొందరు భావిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు సభకు జన ప్రవాహాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. అయితే జనం రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ ప్రభుత్వం చేతిలో ఉన్నవి చాలా పరిమితమైన అవకాశాలేనని చెబుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరు కాకుండా చేయడం, సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకివ్వకుండా చేయడం వంటివి మాత్రమే చేయగలరని.. వాటి వల్ల పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. చూడాలి 31న ఎవరు గర్జిస్తారో, ఎవరిపైన గర్జిస్తారో ?!.
Click on image to read: