నారాయణ చెవి తీసేయాల్సి వస్తుందా?

ఇతర పార్టీల నేతలను తిట్టడంలో ప్రత్యేక శైలి కనబరిచే సీపీఐ నారాయణ ఈసారి తన సొంత చెవిని ఫణంగా పెట్టారు. తన చెవిపై చాలెంజ్ విసిరారు. గ్రేటర్‌ ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరిన నారాయణ… మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంటే తాను చెవి కోసుకుంటానని అన్నారు. కబ్జాదారులకు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేరేడ్‌మెట్ కూడలిలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచారంలో ఆయన […]

Advertisement
Update:2016-01-30 12:40 IST

ఇతర పార్టీల నేతలను తిట్టడంలో ప్రత్యేక శైలి కనబరిచే సీపీఐ నారాయణ ఈసారి తన సొంత చెవిని ఫణంగా పెట్టారు. తన చెవిపై చాలెంజ్ విసిరారు. గ్రేటర్‌ ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరిన నారాయణ… మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంటే తాను చెవి కోసుకుంటానని అన్నారు. కబ్జాదారులకు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేరేడ్‌మెట్ కూడలిలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మొత్తం మీద ఫిబ్రవరి ఐదున నారాయణ చెవి చాలెంజ్ సంగతి తేలుతుంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌ గెలిస్తే కమ్యూనిస్ట్ నేతగా నారాయణ మాట మీద నిలబడుతారో లేక రాజకీయ నాయకుడిగా మాట తప్పి మిగిలిపోతారో!.

Tags:    
Advertisement

Similar News