నాలుగు డాక్యుమెంట్లతో వారంలో పాస్‌పోర్టు

పాస్‌పోర్టు జారీ ఇప్పటి వరకు సుధీర్ఘంగా సాగే వ్యవహారం. దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ కోసం పోలీసులు రావడం, ఆ తర్వాత పాస్‌పోర్టు జారీ అవడం ఇప్పటి వరకు ఉన్న పద్దతి. ఈ సుధీర్ఘ పద్దతి వల్ల దాదాపు నెలకు పైగా సమయం పట్టేది. అయితే ఈ విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. పాస్‌పోర్టు జారీని చాలా సులువు చేసింది. కేవలం నాలుగు పత్రాలు ఉంటే చాలు పాస్‌పోర్టు జారీ చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ తతంగం అంతా తర్వాత చూసుకుంటారు. ఆధార్ […]

Advertisement
Update:2016-01-28 07:19 IST

పాస్‌పోర్టు జారీ ఇప్పటి వరకు సుధీర్ఘంగా సాగే వ్యవహారం. దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ కోసం పోలీసులు రావడం, ఆ తర్వాత పాస్‌పోర్టు జారీ అవడం ఇప్పటి వరకు ఉన్న పద్దతి. ఈ సుధీర్ఘ పద్దతి వల్ల దాదాపు నెలకు పైగా సమయం పట్టేది. అయితే ఈ విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. పాస్‌పోర్టు జారీని చాలా సులువు చేసింది.

కేవలం నాలుగు పత్రాలు ఉంటే చాలు పాస్‌పోర్టు జారీ చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ తతంగం అంతా తర్వాత చూసుకుంటారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్‌ నెంబర్, ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్టు అఫిడవిట్ సమర్పిస్తే చాలు వారంలోనే పాస్‌పోర్టు మన చేతుల్లోకి వస్తుంది. నూతన విధానంలో ఎలాంటి అదనపు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ ట్వీట్టర్‌లో తెలిపారు.

మనం సమర్పించిన డాక్యుమెంట్లు సరైనవా కాదా అన్నది అధికారులే ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకుంటారు. అంతా సవ్యంగా ఉంటే పాస్‌పోర్టు జారీ చేస్తారు. ఆ తర్వాతే పోలీస్‌ వెరిఫికేషన్ ఉంటుంది. గతంలో పాస్‌పోర్టు జారీకి 49 రోజుల గడువు ఉండేది. 2014లో దాన్ని42 రో్జులకు తగ్గించారు. 2015లో సమయాన్ని మరింత కుదించి 21 రోజుల్లో పాస్‌పోర్టు జారీకి చర్యలు తీసుకుంది కేంద్రం. ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త విధానంతో కేవలం వారం రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News