ఆ నిజాలు నాతోనే సమాధి అవుతాయి

సుధీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలను స్వయంగా చూసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాలను వివరించారు. రాష్ట్రపతి తన జ్ఞాపకాల ఆధారంగా రచించిన రెండో పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ గురువారం విడుదల చేశారు. ది టర్బులెంట్‌ ఇయర్స్‌- 1980-86 పేరుతో ఈ పుస్తకం విడుదలైంది.  బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోకపోవడాన్ని  పీవీ నర్సింహారావు రాజకీయ జీవితంలో అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు.  బాబ్రీ మసీదు కూల్చివేత […]

Advertisement
Update:2016-01-28 14:57 IST

సుధీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలను స్వయంగా చూసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాలను వివరించారు. రాష్ట్రపతి తన జ్ఞాపకాల ఆధారంగా రచించిన రెండో పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ గురువారం విడుదల చేశారు. ది టర్బులెంట్‌ ఇయర్స్‌- 1980-86 పేరుతో ఈ పుస్తకం విడుదలైంది. బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోకపోవడాన్ని పీవీ నర్సింహారావు రాజకీయ జీవితంలో అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన భారత దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని ప్రణబ్ అన్నారు.

తనకు తెలిసిన కొన్ని నిజాలు బయటపెట్టలేనని చెప్పారు. కొన్ని నిజాలు తనతోనే సమాధి అవుతాయన్నారు. తన డైరీని డిజిటలైజ్ చేయాల్సిందిగా తన కుమార్తెకు చెప్పానన్నారు. అయితే అందులోని అంశాలు మాత్రం ఎప్పటికీ బహిర్గతం కావని ప్రణబ్ స్పష్టం చేశారు. ఇందిరా హత్య తర్వాత తాను ప్రధాని అయ్యేందుకు ప్రయత్నించినట్టు వచ్చిన వార్తలన్నీ ద్వేషపూరితమైన పుకార్లని ప్రణబ్ అన్నారు. తానెప్పుడూ ప్రధాని పదవి కోసం ప్రయత్నించలేదని చెప్పారు.

ఇందిరా హత్య తర్వాత రాజీవ్‌ గాంధీని ఒంటరిగా కలిసి పార్టీ నేతలంతా ప్రధానిగా చూడాలనుకుంటున్న విషయాన్ని చెప్పానన్నారు. రాజీవ్‌తో ఒంటరిగా చర్చించి ప్రధాని బాధ్యతలు చేపట్టేలా ఒప్పించినట్టు చెప్పారు. కానీ రాజీవ్ ప్రధాని అయిన తర్వాత ఆయన దగ్గర తన గురించి కొందరు చెడుగా చెప్పారని వెల్లడించారు. దీంతో రాజీవ్ గాంధీ తనను కేబినెట్ నుంచి అనంతరం పార్టీ నుంచి తప్పించిన విషయాన్ని ప్రణబ్ గుర్తు చేశారు. రాజీవ్‌ గాంధీ తప్పు చేశారన్నారు. ఒక దశలో తాను ఓపిక నశించి నిస్పృహకు లోనయ్యానని ప్రణబ్ చెప్పారు. గోల్డెన్ టెంపుల్‌పై జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ముందు పరిణామాలు కూడా తనకు తెలుసన్నారు ప్రణబ్. ఈ పుస్తకంలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.

Click on image to read:

 

 

Tags:    
Advertisement

Similar News