వైఎస్‌ రాజారెడ్డి హంతకుల విడుదల దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలో 400 మంది ఖైదీలను విడుదల చేసింది. జీవో 162 ఆధారంగా ఖైదీలను విడుదల చేశారు. వీరిలో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారు కూడా ఉన్నారు. రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 8 మందికి చంద్రబాబు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. గతంలో పరిటాల రవి హత్య కేసులో శిక్ష పడిన మద్దెల చెర్వు సూరిని కాంగ్రెస్ ప్రభుత్వం(వైఎస్ హయాంలో కాదు) […]

Advertisement
Update:2016-01-27 02:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలో 400 మంది ఖైదీలను విడుదల చేసింది. జీవో 162 ఆధారంగా ఖైదీలను విడుదల చేశారు. వీరిలో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారు కూడా ఉన్నారు. రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 8 మందికి చంద్రబాబు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. గతంలో పరిటాల రవి హత్య కేసులో శిక్ష పడిన మద్దెల చెర్వు సూరిని కాంగ్రెస్ ప్రభుత్వం(వైఎస్ హయాంలో కాదు) విడుదల చేసిన సమయంలో పెద్దెత్తున టీడీపీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. కానీ రాజారెడ్డి హంతకుల విడుదల మాత్రం చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంది. వీరి విడుదలపై ఎలాంటి రచ్చ జరగకుండా సైలెంట్‌గా ప్రభుత్వం పని పూర్తి చేసింది. విడుదలైన ఎనిమిది మందిలో ఏడుగురు అనంతపురం జైలులో … ఒకరు కడప సెంట్రల్ జైలులో ఉండేవారు.

1998లో రాజారెడ్డిని ప్రత్యర్థులు బాంబులు వేసి వేటకొడవళ్లతో నరికి చంపారు. కారులో వస్తున్న రాజారెడ్డిని కాపు కాచి హంతకులు దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ హత్య సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న వైఎస్‌ తండ్రినే చంపేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే రాజారెడ్డి హత్య తర్వాత ప్రతికార హత్యలుంటాయని భావించారు. కానీ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మాత్రం హత్యారాజకీయాలు అంతటితో ఆగిపోవాలని ప్రకటించారు. రాజారెడ్డిని హత్య చేసిన వారి జోలికి వైఎస్‌ వర్గీయులు వెళ్లలేదు. కోర్టు ద్వారానే శిక్ష పడింది. హంతకులకు హైకోర్టు జీవిత ఖైదు విధించగా … దాన్ని వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హంతకులకు విధించిన శిక్షను సమర్ధిస్తూ 2009లో సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. అప్పటి నుంచి వారు జైలులో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బయటకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే చాలాకాలంగా కడప జిల్లాలో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైంది. మునుముందు కూడా ఇదే ప్రశాంతత ఉండాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News