మోదీ కౌగిలింతలపై సంచలన కథనం!
ప్రధాని మోదీ వరుస పెట్టి విదేశీ పర్యటన చేస్తున్నారు. వాటి వల్ల దేశానికి ఎంత వరకు ఉపయోగమో గానీ… విదేశీ నేతల వద్ద మోదీ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పర్యటన సమయంలో కనిపించిన నేతనల్లా మోదీ కౌగిలించుకోవడంపై వాషింగ్టన్ పోస్టు ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. మరోసారి ఎదుటి వారిని కౌగిలించుకోవాలంటేనే మోదీ జంకేలా కథనాన్ని రాసింది. అయితే కథనం తన సొంత పైత్యం కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఇలా అనుకుంటున్నారంటూ ఫొటోలు పెట్టి కథనాన్ని […]
ప్రధాని మోదీ వరుస పెట్టి విదేశీ పర్యటన చేస్తున్నారు. వాటి వల్ల దేశానికి ఎంత వరకు ఉపయోగమో గానీ… విదేశీ నేతల వద్ద మోదీ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పర్యటన సమయంలో కనిపించిన నేతనల్లా మోదీ కౌగిలించుకోవడంపై వాషింగ్టన్ పోస్టు ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. మరోసారి ఎదుటి వారిని కౌగిలించుకోవాలంటేనే మోదీ జంకేలా కథనాన్ని రాసింది. అయితే కథనం తన సొంత పైత్యం కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఇలా అనుకుంటున్నారంటూ ఫొటోలు పెట్టి కథనాన్ని పబ్లిష్ చేసింది. వాషింగ్టన్ పోస్టు కథనం చూసిన తర్వాత నెటిజన్లు తమ పోస్టులకు పని చెప్పారు.
మోదీ ఫోటోలపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మోదీ తీరు అసభ్యకరంగా ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అప్యాయంగా కౌగిలించుకోవడం భారత్‌తో తప్పు కాకపోయినా ఇతర దేశాలకు వెళ్లిన సమయంలోనూ అలాగే ప్రవర్తించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాషింగ్టన్ పోస్టు మోదీ కౌగిలింతలపై కొన్ని ఫొటోలను ప్రచురించగా నెటిజన్లు మరికొన్ని సేకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మోదీ కౌగిలించుకునే సమయంలో ఇతర దేశాల నేతలు ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా అనిపించే ఫొటోలను ఏరికోరి పెడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిని వెనుకనుంచి కౌగిలించుకుట్టున్నట్టుగా ఉన్న ఫొటోలపై మరింత తీవ్రంగా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తం మీద వాషింగ్టన్ పోస్టు ఏ ఉద్దేశంతో ఈ కథనాన్ని రాసిందో గానీ భవిష్యత్తులో ఎదుటి వారిని కౌగిలించుకునేందుకు మోదీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే.