తాడిపత్రిని లిమ్కాబుక్‌లోకి ఎక్కించిన జేసీ

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో మరే మున్సిపాలిటికీ భవనం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా భవనం నిర్మించారు. పాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించిన ఘనత కూడా జేసీ హయాంలో తాడిపత్రి మున్సిపాలిటీకే దక్కుతుంది. మున్నిపల్ చైర్మన్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా తాడిపత్రి మున్సిపాలిటీ తీరుతెన్నులు మెచ్చుకుని అందరూ అలా పనిచేయాలని సూచించారు. చాలా మంది ఈ భవనాన్ని చూసేందుకూ వస్తుంటారు. తాజాగా […]

Advertisement
Update:2016-01-26 03:09 IST

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో మరే మున్సిపాలిటికీ భవనం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా భవనం నిర్మించారు. పాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించిన ఘనత కూడా జేసీ హయాంలో తాడిపత్రి మున్సిపాలిటీకే దక్కుతుంది. మున్నిపల్ చైర్మన్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా తాడిపత్రి మున్సిపాలిటీ తీరుతెన్నులు మెచ్చుకుని అందరూ అలా పనిచేయాలని సూచించారు. చాలా మంది ఈ భవనాన్ని చూసేందుకూ వస్తుంటారు. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పేరు లిమ్కాబుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కించారు. మున్సిపల్ ఆఫీసు ఆవరణలో ప్రభాకర్ రెడ్డి నిర్మించిన ఫ్లాగ్‌ పోల్‌ అందుకు కారణం. 48 అడుగుల ఎత్తుతో ఈ ప్లాగ్ పోల్ నిర్మించారు. ఈ ప్లాగ్‌ పోల్‌లోని ప్రత్యేకతలు లిమ్కాబుక్‌ వారిని ఆకర్శించాయి.

సాధారణంగా ప్లాగ్‌ పోల్‌కు జెండా ఎగరేయాలంటే అందుకు సంబంధించిన తాడు బయటకు కనిపిస్తుంది. ఎగరవేయడం కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. జేసీ నిర్మించిన ప్లాగ్‌ పోల్ మాత్రం నూతనమైనది. ప్లాగ్ ఎగరేసిన సమయంలో ఈ పోల్‌ వద్ద తాడు బయటకు కనిపించదు. కేవలం పోల్‌పై చివర జెండా మాత్రమే కనిపిస్తుంది. ఈ తరహాలో, ఇంత భారీ ప్లాగ్ పోల్ మరెక్కడా లేదని చెబుతున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News