శైలజపై మనసుపడ్డ ఎన్టీఆర్
నేను శైలజ సినిమాతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. తెలుగులో చేసిన తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఎక్కడా రెగ్యులర్ హీరోయిన్ ఛాయలు కనిపించవు. అన్నీ కనిపించేలా దుస్తులు వేసుకోలేదు….. హీరోల వెంటపడ లేదు…. మాస్ స్టెప్పులు కూడా వేయలేదు. కేవలం తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ కు నచ్చింది. తన అప్ కమింగ్ మూవీ జనతా గ్యారేజీ కోసం కీర్తి సురేష్ నే ప్రయత్నిస్తున్నాడట తారక్. దర్శకుడు కొరటాల శివ కూడా […]
Advertisement
నేను శైలజ సినిమాతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. తెలుగులో చేసిన తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఎక్కడా రెగ్యులర్ హీరోయిన్ ఛాయలు కనిపించవు. అన్నీ కనిపించేలా దుస్తులు వేసుకోలేదు….. హీరోల వెంటపడ లేదు…. మాస్ స్టెప్పులు కూడా వేయలేదు. కేవలం తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ కు నచ్చింది. తన అప్ కమింగ్ మూవీ జనతా గ్యారేజీ కోసం కీర్తి సురేష్ నే ప్రయత్నిస్తున్నాడట తారక్. దర్శకుడు కొరటాల శివ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో మొదట సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తారక్-సమంత కాంబోలో వచ్చిన రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు రెండూ ఫ్లాపయ్యాయి. దీంతో సెంటిమెంట్ ప్రకారం ఆమెను తప్పించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు కొరటాలకు కలిసొచ్చిన శృతిహాసన్ ను తీసుకోవాలని అనుకున్నప్పటికీ…. ఎన్టీఆర్-శృతిహాసన్‌కు దమ్ము సినిమా టైమ్ లోనే గొడవలయ్యాయని సమాచారం. దీంతో కీర్తి సురేష్ ను తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Click on Image to Read:
Advertisement