అంతొద్దు- బాబు సర్కార్‌ను దెబ్బకొట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది. రాజధాని నిర్మాణం కోసం ఇష్టమొచ్చినట్టు భూమిని సేకరిస్తున్న బాబు ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం మరో 33,500 హెక్టార్లు(దాదాపు 83 వేల ఎకరాలు) అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఇందుకోసం అటవీ భూమిని డీ నోటిఫై చేయాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫైల్ పంపింది. అయితే ఆ ఫైల్‌ను కేంద్రం తిరస్కరించి వెనక్కు పంపింది. […]

Advertisement
Update:2016-01-26 07:45 IST

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది. రాజధాని నిర్మాణం కోసం ఇష్టమొచ్చినట్టు భూమిని సేకరిస్తున్న బాబు ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం మరో 33,500 హెక్టార్లు(దాదాపు 83 వేల ఎకరాలు) అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఇందుకోసం అటవీ భూమిని డీ నోటిఫై చేయాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫైల్ పంపింది. అయితే ఆ ఫైల్‌ను కేంద్రం తిరస్కరించి వెనక్కు పంపింది. ఏకంగా 83 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం అడగడం చూసి కేంద్ర ప్రభుత్వ అధికారులు కంగుతిన్నారు. ఈస్థాయిలో అటవీ ప్రాంతాన్ని అప్పగించడం కుదరదని అందుకు నిబంధనలు ఒప్పుకోవని తేల్చిచెప్పింది కేంద్రం. భూమి విస్తీర్ణాన్ని 9 వేల హెక్టార్లకు కుదించి కొత్త ప్రతిపాదనలు పంపితే అప్పుడు ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ఆ 9000 హెక్టార్లు కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో ఇవ్వలేమని… అడవులు అంతరించిపోతున్న ప్రాంతంలో అయితే ఇవ్వడం సాధ్యమవుతుందని ముందే ఒక సూచన కూడా చేసింది. దీంతో ఇప్పుడేం చేయాలన్న దానిపై చంద్రబాబు సర్కార్ తర్జనభర్జన పడుతోంది.

ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు పంపినా నాలుగున్నర వేల హెక్టార్లకు మించి ఇచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతంలో 3.5 వేల హెక్టార్ల భూమిని ఇచ్చేందుకు అటవీ శాఖ సుముఖంగా ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం దుగ్గిరాలపాడు పరిధిలో భూమిని ఇవ్వాలని అది రాజధానికి దగ్గరగా ఉంటుందని కోరుతోంది. అయితే అక్కడి అటవీ ప్రాంతం చాలా దట్టంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో భూమిని తీసుకునేందుకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే 9000 హెక్టార్లకు ప్రతిపాదన పంపినా కేంద్రం పెట్టిన షరతుల ప్రకారం నాలుగున్నర వేల హెక్టార్లకు మించి అటవీ భూమి దక్కే అవకాశం లేదు. అటవీ భూముల పైల్‌ను కేంద్రం వెనక్కు పంపడంపై చంద్రబాబు కూడా స్పందించారు. అటవీ భూముల కేటాయింపుపై కేంద్రం అడ్డుపుల్లలేస్తోందని త్వరలోనే మరోసారి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. మొత్తం మీద 83 వేల ఎకరాలు అటవీ భూమిని తీసుకుని దాని సాయంతో చాలా పనులు చేయాలనుకున్న చంద్రబాబుకు కేంద్రం గట్టి దెబ్బకొడుతోంది. చూడాలి చంద్రబాబు ఢిల్లీలో మరోసారి ఎలా చక్రం తిప్పుతారో!

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News