లోకేష్ ఎవరు? ఓ ఆ బచ్చానా?- టీడీపీ మాజీ మంత్రి

లోకేష్. ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో జనానికి బాగానే పరిచయం అయిన పేరు. అయితే టీడీపీలో సుధీర్ఘం కాలం పనిచేసిన సీనియర్ రాజకీయనాయకుడు, ప్రస్తుత తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాత్రం లోకేష్‌ ఎవరో తనకు తెలియదన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో లోకేష్‌ ప్రచారంపై ప్రశ్నించగా తలసాని ”లోకేష్ ఎవరు?.. ఓ ఆ బచ్చానా?” అంటూ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి వచ్చి ఇప్పుడు లోకేష్ ఎవరో తెలియదనే సరికి విలేకర్లు కూడా ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు. […]

Advertisement
Update: 2016-01-24 23:43 GMT

లోకేష్. ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో జనానికి బాగానే పరిచయం అయిన పేరు. అయితే టీడీపీలో సుధీర్ఘం కాలం పనిచేసిన సీనియర్ రాజకీయనాయకుడు, ప్రస్తుత తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాత్రం లోకేష్‌ ఎవరో తనకు తెలియదన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో లోకేష్‌ ప్రచారంపై ప్రశ్నించగా తలసాని ”లోకేష్ ఎవరు?.. ఓ ఆ బచ్చానా?” అంటూ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి వచ్చి ఇప్పుడు లోకేష్ ఎవరో తెలియదనే సరికి విలేకర్లు కూడా ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు. కాసేపు కేకేను గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కేకే కూడా గతంలో జగన్‌ విషయంలో ఇలాగే మాట్లాడారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ పేరు సీఎం రేసులోకి వచ్చిన సమయంలో కేకే కూడా జగన్‌ ఎవరు?. ఓ రాజశేఖర్ కొడుకా ? అని ముక్తాయించడాన్ని విలేకర్లు గుర్తు చేసుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News