అందుకే చేతగాని వాడిలా బతుకుతున్నా..!

విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా రాజకీయంగా తాను ఎంచుకున్న దారిపై స్పందించారు. వంగవీటి రాధా తనపై వస్తున్న విమర్శలకు ఒక ఇంటర్వ్యూలో  ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాధా తన తండ్రిలా పవర్ ఫుల్ కాదన్న అభిప్రాయం ఉంది… దీనిపై ఏమంటారని ప్రశ్నించగా రాధా తీవ్రంగా స్పందించారు. ”ఇప్పటి వరకు నిందలు మోస్తోంది ఎందుకో తెలుసా?. నన్ను చేతగాని వాడు అని ప్రతి అడ్డమైన నా కొడుకు అంటున్నా ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా” అని ఎదురు […]

Advertisement
Update:2016-01-25 14:13 IST

విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా రాజకీయంగా తాను ఎంచుకున్న దారిపై స్పందించారు. వంగవీటి రాధా తనపై వస్తున్న విమర్శలకు ఒక ఇంటర్వ్యూలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాధా తన తండ్రిలా పవర్ ఫుల్ కాదన్న అభిప్రాయం ఉంది… దీనిపై ఏమంటారని ప్రశ్నించగా రాధా తీవ్రంగా స్పందించారు. ”ఇప్పటి వరకు నిందలు మోస్తోంది ఎందుకో తెలుసా?. నన్ను చేతగాని వాడు అని ప్రతి అడ్డమైన నా కొడుకు అంటున్నా ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా” అని ఎదురు ప్రశ్నించారు. గొడవ పెట్టుకోవడానికి చాలా సులువని… కానీ ఒక్కడు ఆయుధం పడితే అది రెండు కుటుంబాల స్థాయి నుంచి రెండు కులాల మధ్య పోరుగా మారుతుందని దాని వల్ల ఎంతో మంది నష్టపోతారని అన్నారు. అందుకే ఎవరు ఏమంటున్నా మౌనంగా ఉంటున్నానని చెప్పారు. తన కుటుంబంలాగా విజయవాడలో మరే కుటుంబం నష్టపోకూడదని అందుకే చేతగాని వాడిలా మౌనంగా బతుకుతున్నానని చెప్పారు.

విజయవాడలో కమ్మ, కాపు మధ్య ఇప్పటికీ అడ్డుపొర ఉన్న మాట వాస్తవమేనని అది తొలగిపోతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. 2009లో వైఎస్‌పై అపనమ్మకంతో తాను పీఆర్పీలోకి పోలేదని… ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న కొందరి నేతల కారణంగా పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు. జగన్‌తో ఉన్న స్నేహం కారణంగానే వైసీపీలో చేరానని రాధా చెప్పారు. పార్టీలోకి రావాల్సిందిగా దేవినేని నెహ్రును ఎవరూ బతిమాలడం లేదని.. వారే రకరకాల మార్గాలలో ప్రయత్నాలు చేస్తున్నారని రాధా విమర్శించారు.

Full View

 

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News