పోలీస్ నీడలో హెచ్‌సీయూ, పట్టువీడని విద్యార్థులు
పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఇంకా చల్లారలేదు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. వర్శిటీలోకి విద్యార్థులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అన్ని దారులను దిగ్బంధించారు. దీంతో విద్యార్థి లోకం మండిపడుతోంది. రోహిత్ మృతి నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్శిటీలు కలిసి చలో హెచ్‌సీయూకు పిలుపునిచ్చాయి. దాదాపు 10 వేల మంది విద్యార్థులు హెచ్‌సీయూకు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్‌సీయూ వద్ద ఆంక్షలు విధించారు. ఐడీ కార్డు లేని విద్యార్థులతో […]
పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఇంకా చల్లారలేదు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. వర్శిటీలోకి విద్యార్థులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అన్ని దారులను దిగ్బంధించారు. దీంతో విద్యార్థి లోకం మండిపడుతోంది. రోహిత్ మృతి నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్శిటీలు కలిసి చలో హెచ్‌సీయూకు పిలుపునిచ్చాయి. దాదాపు 10 వేల మంది విద్యార్థులు హెచ్‌సీయూకు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్‌సీయూ వద్ద ఆంక్షలు విధించారు. ఐడీ కార్డు లేని విద్యార్థులతో పాటు నాయకులను కూడా లోనికి అనుమతించడం లేదు. క్యాంపస్ లోపల, బయట భారీగా బలగాలు మోహరించాయి.అయితే ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటకకు చెందిన విద్యార్థులు హెచ్‌సీయూకు చేరుకున్నట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నారు. వారంతా కలిసి క్యాంపస్ లోపల భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు.