సినీ రంగంలో అవార్డులు వీళ్లకే...
బాలీవుడ్ సీనియర్ నటుల్లో అనుపమ్ ఖేర్ ఒక విశిష్టమైన ఆర్టిస్ట్. 3 దశాబ్దాలకు పైగా ఎన్నో వందల చిత్రాల్లో మెప్పించిన అనుపమ్ ఖేర్ రంగస్థలం నుంచి బాలీవుడ్ వెండి తెరకు వచ్చిన ఆణిముత్యాల్లో ఒకరు. 1955 మార్చి 7 న జన్మించిన అనుపమ్ ఖేర్, 1982 సంవత్సరంలో నటుడిగా ఆగమన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. 1984 లో వచ్చిన సారాంష్ చిత్రంతో కెరీర్ పరంగా ఆయన వెనక్కు చూసుకోలేదు. 1989 లో వచ్చిన డాడి చిత్రం […]
సుదీర్ఘమైన ఆయన నట జీవితం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2004 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో పురస్కారం ఇచ్చి సత్కరించింది. తాజాగా కేంద్రప్రభుత్వం దేశంలో మూడో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అనుపమ్ ఖేర్ ను వరించింది.
—————————————————————————————————————
1975 లో అపూర్వ రాగం గళః ( తెలుగులో అంతులేని కథ) దర్శకుడు కే బాలచందర్ పరిచయం చేసిన రజనీకాంత్ ప్రస్తుతం కోట్లాది రూపాయల బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అయ్యారు. ఆసియాలో జాకిచాన్ తరువాత అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే నటుడు ఒన్ అండ్ వన్లీ రజనీకాంత్ మాత్రమే. ప్రస్తుతం రోబో సీక్వెల్.. కబాలీ చిత్రాలతో సిద్దం అవుతున్నారు. నటుడిగా తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్న పురస్కారాల్లో రెండవది అయిన పద్మవిభూషణ్ ప్రకటించడం పట్ల కోట్లాది మంది ఆయన అభిమానులకు పండగలా ఉంది. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న కబాలీ, రోబో సీక్వెల్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల పెట్టుబడి దాదాపు 4 వందల కోట్లు వుంటుందని కోలీవుడ్ మీడియా టాక్.
—————————————————————————————————————
తండ్రి వీరు దేవగన్ బాలీవుడ్ లో స్టంట్ మాస్టర్ గా చేశారు. చిన్న తనం నుంచి అజయ్ దేవగన్ సినిమా వాతావరణంలో పెరిగారు. 1998లో అజయ్ దేవగన్ నటించిన జఖ్మ చిత్రానికి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. కళా కారుడిగా అజయ్ దేవగన్ అందిస్తున్న సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఇది అజయ్ దేవగన్ అభిమానులకు పండగే మరి.
—————————————————————————————————————
నటిగా వైవిధ్యానికి పెద్ద పీట వేసే ప్రియాంక తన ప్రతిభను హాలీవుడ్ లోకూడా చాటుకున్నారు. పిటుబుల్ చేసిన ఒక ఆల్బమ్ లో నటించి హాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైయ్యారు. ఆర్టిస్ట్ గా తన సేవలకు ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం నిజంగా ఆమే అభిమానులకు ఇది చాలా హ్యాపి మూమెంట్ మరి.
—————————————————————————————————————
ఎన్టీఆర్ కు సింహాద్రి, ప్రభాస్ కు చత్రపతి, రాంచరణ్ కు మగథీర, ఈగ చిత్రంతో సాంకేతికంగా తను ప్రతిభ.. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతని అంతర్జాతీయంగా చాటిన దర్శక దిగ్గజం. ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ ను చేస్తున్న రాజమౌళి కి పద్శ శ్రీ పురస్కారం ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆయన పై మరింత బాధ్యతను పెంచుతుంది అనడంలో సందేహాం లేదు.
—————————————————————————————————————
1988 లో రిలీజ్ అయిన ఖయమత్ సే ఖయమత్ తక్ చిత్రంలోని పాటలు ఉదిత్ కు మంచి పేరు తెచ్చాయి. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ఉదిత్ నారాయణ 2004 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తాజాగా ఆయనకు పద్శభూషణ్ రావడం పట్ల ఆయన అభిమానులు ఖుషిగా ఉన్నారు. అవార్డులు అందుకున్న సినిమా దిగ్గజాలకు తెలుగు గ్లోబల్ తరుపున అభినందనలు .