లిక్కర్ కేసు కాస్త 600 కోట్ల ఆస్తుల కేసుగా మారిందా?

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ కల్తీ లిక్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేసు దర్యాప్తుకు నియమించిన సిట్ … మల్లాది ఆస్తులపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కల్తీ లిక్కర్‌కు కారణం ఎవరో తేల్చాల్సిన సిట్ పనిలో పనిగా విష్ణు ఆస్తుల చిట్టాను లెక్కకట్టిందట. అంతటితో ఆగకుండా ఆస్తుల వివరాలను ఈడీకి పంపిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు మల్లాది విష్ణుకు సంబంధించి రూ. 600 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని సిట్ చెబుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల […]

Advertisement
Update:2016-01-25 06:24 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ కల్తీ లిక్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేసు దర్యాప్తుకు నియమించిన సిట్ … మల్లాది ఆస్తులపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కల్తీ లిక్కర్‌కు కారణం ఎవరో తేల్చాల్సిన సిట్ పనిలో పనిగా విష్ణు ఆస్తుల చిట్టాను లెక్కకట్టిందట. అంతటితో ఆగకుండా ఆస్తుల వివరాలను ఈడీకి పంపిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు మల్లాది విష్ణుకు సంబంధించి రూ. 600 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని సిట్ చెబుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ లెక్కలు తేల్చారట. అమరావతి సమీపంలో విష్ణు, అతడి సన్నిహితుల పేరు మీద 28 ఎకరాలు భూమిని గుర్తించినట్టు సిట్ చెబుతోంది. అయితే కల్తీ లిక్కర్‌కు కారణం ఎవరో తేల్చాల్సిన సిట్ అంతకంటే ఎక్కువ శ్రద్ధను విష్ణు ఆస్తుల వివరాల సేకరణ పట్ల చూపడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిట్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని మల్లాది విష్ణు ఆరోపించారు. తనను భయపెట్టడానికి ప్రభుత్వం చేయిస్తున్న ప్రచారమని మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News