భోజనం చేశాక ఇవి చేయొద్దు!
కడుపు నిండా కమ్మని భోజనం చేసినా తృప్తి ఉండదు కొందరికి. తరువాత ఒక సిగరెట్ తాగడమో లేదా ఓ పండు తినడమో చేస్తుంటారు. భోజనం చేశాక ఇలాంటి పనులు చేయవచ్చా…అంటే, కూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం చేశాక చేయకూడని పనుల్లో ఇవన్నీ ఉన్నాయి- అన్నం తినగానే నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. భోజనం తరువాత ఒక చిన్నపాటి కునుకు మంచిదే అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువ సమయం నిద్రపోవడం మాత్రం అంత మంచిది […]
Advertisement
కడుపు నిండా కమ్మని భోజనం చేసినా తృప్తి ఉండదు కొందరికి. తరువాత ఒక సిగరెట్ తాగడమో లేదా ఓ పండు తినడమో చేస్తుంటారు. భోజనం చేశాక ఇలాంటి పనులు చేయవచ్చా…అంటే, కూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం చేశాక చేయకూడని పనుల్లో ఇవన్నీ ఉన్నాయి-
- అన్నం తినగానే నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. భోజనం తరువాత ఒక చిన్నపాటి కునుకు మంచిదే అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువ సమయం నిద్రపోవడం మాత్రం అంత మంచిది కాదు. నిద్రపోతున్నంత సేపు జీర్ణక్రియ మందకొడిగా సాగి, నిద్రలేచాక కూడా పొట్ట హెవీగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. భోజనం చేశాక వెల్లకిలా పడుకున్నా, పక్కకు తిరిగి పడుకున్నా మన పొట్టలోని జీర్ణరసాలు వెనక్కు అన్నవాహికలోకి ప్రవహించి గుండెల్లో మంటకు కారణం అవుతాయి. అలా కాకుండా మనం మెలకువగానూ నిటారుగానూ ఉండటం వలన జీర్ణరసాలు ఉండాల్సిన చోట ఉండి ఆహారం అరుగుదలకు తోడ్పడతాయి. నిద్రలో జీర్ణక్రియ సరిగ్గా సాగదు కనుక, తినగానే నిద్రపోతే లేవగానే, పొట్టలో ఉబ్బరం, అసౌకర్యం, పొట్టనిండుగానే అనిపించడం లాంటి సమస్యలు ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్లు పొద్దున్న పూట రాజులా, మధ్యాహ్నం సామాన్యునిలా, రాత్రి పేదవానిలా తినాలని చెప్పారు. రాత్రి తిన్నతరువాత నిద్రపోతాం కనుక అజీర్ణ సమస్యలు రాకుండా అలా చెప్పారన్నమాట.
- భోంచేయగానే సిగరెట్ తాగటం చాలామంది అలవాటు. సిగరెట్లు తగ్గించేశా…భోంచేశాక ఒక్కటే కాలుస్తున్నా అనేవారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే- భోజనం చేశాక తాగే ఒక్క సిగరెట్ పది సిగరెట్లకు సమానం అవుతుందట..
- భోజనం తరువాత స్నానం చేయకూడదని కూడా పెద్దవాళ్లు చెబుతారు. అందుకు శాస్త్రీయమైన కారణం ఉంది. భోజనం తరువాత స్నానం చేస్తే అరుగుదలకు తోడ్పడాల్సిన పొట్టప్రాంతంలోని రక్తం, శరీరంలోని ఇతర అవయవాలకు వెళ్లిపోయి, జీర్ణక్రియ మందగిస్తుంది.
- భోజనం తరువాత పళ్లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే పళ్లు త్వరగా జీర్ణమై, భోజనంలోని ఆహారం నిదానంగా జీర్ణం కావడం వలన సమస్యలు వస్తాయి. పళ్లను భోజనం తరువాత కంటే ముందు తినడం మంచిది. అది కూడా భోజనానికి ఒక గంట ముందు తినాలి, భోజనం తరువాత అయితే రెండుగంటలు ఆగి తినాలి.
- భోజనం చేయగానే టీ తాగటం కూడా మంచిది కాదు. ఎందుకంటే టీ ఆకుల్లో ఆమ్లతత్వం ఉంటుంది. ఇది జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. టీని భోజనానికి ముందూ వెనుకా కనీసం ఒక గంట సమయం తేడాతో తీసుకుంటే మేలు.
Advertisement