పెళ్లి కాని ప్రసాద్‌లను రెచ్చగొడుతున్న హరీష్‌

నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక భారాన్ని తనపై వేసుకున్న మంత్రి హరీష్‌రావు కొత్త  ఎత్తులతో ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ కొడితే జనం కాంగ్రెస్‌కు దూరం అవుతారో అక్కడే కొడుతున్నారు. కొత్తగా నారాయణఖేడ్‌లో పెళ్లి సెంటిమెంట్‌ను హరీష్‌రావు పదేపదే ప్రస్తావిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువతకు పెళ్లి కాకపోవడానికి కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీరు కూడా లేవని… 60 ఏళ్లలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని […]

Advertisement
Update:2016-01-23 05:17 IST

నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక భారాన్ని తనపై వేసుకున్న మంత్రి హరీష్‌రావు కొత్త ఎత్తులతో ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ కొడితే జనం కాంగ్రెస్‌కు దూరం అవుతారో అక్కడే కొడుతున్నారు. కొత్తగా నారాయణఖేడ్‌లో పెళ్లి సెంటిమెంట్‌ను హరీష్‌రావు పదేపదే ప్రస్తావిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువతకు పెళ్లి కాకపోవడానికి కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీరు కూడా లేవని… 60 ఏళ్లలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని హరీష్ ఆరోపిస్తున్నారు. తాగేందుకు నీరు లేకపోవడం వల్లే నారాయణఖేడ్‌ పరిధిలోని చాలా గ్రామాల్లో పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావడం లేదని చెబుతున్నారు. కాబట్టి మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇక ఎప్పటికీ పెళ్లి కాదంటూ పెళ్లికానీ ప్రసాద్‌ల వీక్‌నెస్‌పై హరీష్‌ అటాక్ చేస్తున్నారు. చూడాలి హరీష్‌ రావు ఎత్తులు ఎంతవరకు పని చేస్తాయో!.

Tags:    
Advertisement

Similar News